Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అప్పుడు 'లెస్బియన్‌'గా... ఇప్పుడేమో ఇలా: 'ఎవరు' చిత్రంపై రెజీనా ఇంటర్వ్యూ

అప్పుడు 'లెస్బియన్‌'గా... ఇప్పుడేమో ఇలా: 'ఎవరు' చిత్రంపై రెజీనా ఇంటర్వ్యూ
, బుధవారం, 14 ఆగస్టు 2019 (17:47 IST)
యంగ్‌ హీరో అడివి శేష్‌ హీరోగా రెజినా ప్రధాన పాత్రలో నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్న సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘ఎవరు’. వెంకట్‌ రామ్‌జీ తొలిసారి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాను పి.వి.పి సినిమా బ్యానర్‌పై ప్రసాద్‌ వి పొట్లూరి, పరం వి పొట్లూరి, కెవిన్‌ అన్నే ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఎవరు ఆగస్టు 15 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా రెజినాతో ఇంట‌ర్వ్యూ మీ కోసం...
 
ఈ ప్రాజెక్ట్ ఎలా ఓకే అయింది?
ఈ సినిమా చేయమని నిర్మాత పివిపి గారు కాల్ చేసి అడిగారు. రాంజీ అనే డెబ్యూ డైరెక్ట్ హ్యాండిల్ చేస్తాడని చెప్పారు. ఆ తర్వాత రాంజీ గారు శేష్ చెన్నైకి వచ్చి నెరేషన్ ఇచ్చారు. కథ విన్నాను. నచ్చడంతో వెంటనే ఒకే చెప్పాను. దాంతో ఈ ప్రాజెక్ట్ ఓకే అయింది.
 
ఈ క్యారెక్టర్‌కి మీరే ఫస్ట్ ఛాయిసా?
షూటింగ్ మొదటి రోజు మేడం మీరే నా ఫస్ట్ ఛాయిస్ అని డైరెక్టర్ రాంజీ చెప్పాడు. ఆ విషయం నాకు నెరేషన్ ఇచ్చేటప్పుడు కూడా చెప్పలేదు. ఆ మాట చాలా సంతోషపడ్డాను. ఈ క్యారెక్టర్ నాకు దొరకడం హ్యాపీగా ఉంది.
 
మీ క్యారెక్టర్ గురించి?
సినిమాలో సమీర అనే క్యారెక్టర్ చేసాను. ఒక కంపెనీ సీ.ఈ.ఓకి భార్యగా కనిపిస్తాను. ఇంటెన్స్ ఉన్న క్యారెక్టర్. ఎక్కువగా మాట్లాడదు, ఫేస్‌లో ఎక్కువ ఎక్స్‌ప్రెషన్స్ ఉండవు. చాలా డిఫెరెంట్‌గా ఉంటుంది. ఇప్పటి వరకూ ఇలాంటి క్యారెక్టర్ ఫుల్‌ఫ్లెడ్జ్‌గా చేయలేదు. ఆ రకంగా నాకిది ఫుల్ మీల్స్ లాంటి క్యారెక్టర్. చేస్తున్నప్పుడు బాగా ఎంజాయ్ చేస్తూ చేసాను. ఇలాంటి క్యారెక్టర్స్ అప్పుడప్పుడూ వస్తుంటాయి.
webdunia
 
శేష్‌తో వర్క్ ఎక్స్పీరియన్స్?
శేష్ నైస్ పర్సన్. సెట్స్‌లో చాలా సరదాగా ఉండేవాళ్ళం. నా ఫుడ్ తినేవాడు. నేను తినే ఫుడ్ అంటే చాలా ఇష్టపడేవాడు. ఇద్దరం కలిసి ఎంజాయ్ చేస్తూ సినిమా చేసాం. సినిమాలో నేను 80 % ఉంటాను. శేష్ రాంజీ నాకు కథ చెప్పినప్పుడు కూడా ఇదే చెప్పారు. ఒక సినిమాలో ఇంత లెంగ్త్, ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నాను.
 
ట్రైలర్ చూస్తుంటే బద్లా సినిమాకు సిమిలారిటీ ఉంది అనిపిస్తుంది?
సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యాక బద్లా సినిమాకు ఎవరుకి కొంచెం సిమిలారిటీ ఉందని అంటున్నారు. సినిమా చూసాక రెండిటికి ఎలా తేడా ఉండదని గమనిస్తారు. సో అప్పుడు మీరే చెప్తారు. ఏదైనా సినిమా చేసేటప్పుడు ఈ క్యారెక్టర్ నా కెరీర్‌కి ఎలా హెల్ప్ అవుతుంది.. ఎంత పేరొస్తుంది అని అస్సలు ఆలోచించను. క్యారెక్టర్‌కి నేను బెస్ట్ ఇవ్వగలనా అనేది మాత్రమే ఆలోచిస్తాను. ఎవరు చేసేటప్పుడు కూడా అదే ఆలోచించాను. 
 
ఇండస్ట్రీలో మీరు చాలా కాలంగా ఉన్నారు కదా! ఏమైనా నేర్చుకున్నారా?
ఇండస్ట్రీకి వచ్చి ఏడేళ్ళయింది. నా మొదటి సినిమా ఎస్.ఎం.ఎస్ 2011లో విడుదలైంది. అప్పుడు నాకేం తెలియదు. సినిమా చేసేటప్పుడు రూల్స్ కానీ కొన్ని‌సార్లు ప్రోటోకాల్ పాటించాలని తెలియదు. ఇప్పుడు చాలా నేర్చుకున్నాను. ఈ ఏడేళ్ళల్లో ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఏదైనా సినిమా ఫెయిలయినప్పుడు అందులో నేను చేసిన తప్పులు కూడా ఆలోచిస్తాను. చేసిన ప్రతీ సినిమాకు నన్ను నేను అనాలసిస్ చేసుకుంటాను. కొన్ని సార్లు మనం రైట్ అనుకుంటాం కానీ అవి రాంగ్ అవుతుంటాయి.
webdunia
 
బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు కదా... ఎలా అనిపిస్తుంది?
నిజానికి కొన్నిసార్లు రూల్స్ బ్రేక్ చేయాల్సి వస్తుంది. ‘ఏక్ లడికి కో దేఖాతో ఐసా లగా’ సినిమాను అలాంటి రూల్‌నే బ్రేక్ చేసాను. అందులో విభిన్నంగా లెస్బియన్ క్యారెక్టర్ చేసాను. క్యారెక్టర్ చిన్నదే అయినా నటిగా నాకు మంచి పేరొచ్చింది. ఆ క్యారెక్టర్ చేయడం కరెక్టేనా..? అని చాలా ఒపీనియన్స్ తీసుకున్నాను. కొందరు అలాంటి క్యారెక్టర్‌తో డెబ్యూ అవసరమా అని అడిగారు. ఫైనల్‌గా ఆ సినిమా నాకు మంచి గుర్తింపు తెచ్చింది అని చెప్పింది రెజీనా.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

#BiggBossTelugu3 లేటెస్ట్ ప్రోమో.. దమ్ముంటే రండ్రా అంటోన్న బాబా భాస్కర్ (వీడియో)