బుల్లితెరే ఇష్టమంటున్న అవికా గోర్...

మంగళవారం, 15 అక్టోబరు 2019 (11:32 IST)
అవికా గోర్ అనే పేరు కొందరికి మాత్రమే తెలుసుంటది. కాని ఆనంది అని చెప్పగానే చిన్నారి పెళ్లికూతురు(బాలికా వధు) ఆనంది అని అందరికీ తెలుసు.... ఎందుకంటే బుల్లితెరపై తనకు ఉన్న క్రేజ్ అలాంటిది.

కలర్స్ టివిలో "బాలికా వధు"(తెలుగులో చిన్నారి పెళ్ళికూతురుగా అనువాదమైనది) అనే హిందీ సీరియల్‌‌లో నటించింది. తరువాత ఉయ్యాల జంపాల చిత్రం ద్వారా తెలుగు సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తరువాత లక్ష్మీ రావే మా ఇంటికి, ఎక్కడికి పోతావు చిన్నావడా, సినిమా చూపిస్త మావ సినిమాలలో నటించింది. ఆ తరువాత తెలుగు సినిమాలకు దూరమైంది. హిందీ సీరియల్ చేస్తూ బిజిగా ఉంటుంది. ప్రస్తుతం అవికా "రాజు గారి గది 3" నటిస్తున్నారు. 
 
తాజాగా ఒక ఇంటర్వ్యూలో తనకు సినిమాల కన్నా సీరియల్స్‌‌లో నటించడమే ఇష్టమంటోంది కథానాయిక అవికా గోర్. కొంతమంది అడుగుతుంటారు.. మీకు తెలుగు సినిమాలు చేయడం ఇష్టమా? హిందీ సినిమాలు చేయడం ఇష్టమా? అని. అయితే తనకు మాత్రం టీవీ సీరియళ్లలో నటించడమే ఇష్టమంటాను. ఎందుకంటే నేను అక్కడి నుంచే వచ్చాను, నాకు పేరు కూడా అక్కడే వచ్చింది' అని చెప్పింది.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం రాజ్‌తరుణ్‌ ‘ఒరేయ్‌.. బుజ్జిగా’ వ‌చ్చేది ఎప్పుడు?