Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెండితెర, బుల్లితెర రెంటికీ ప్రాధాన్యంః ఇంద్ర‌జ‌

Webdunia
బుధవారం, 30 జూన్ 2021 (17:38 IST)
Indraja
ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో సీనియర్ హీరోలతో సినిమాలు చేసి మంచి గుర్తింపు సంపాదించుకున్న బ్యూటీ ఇంద్రజ. అలీ లాంటి కామెడీ హీరోల నుంచి బాలయ్య, మోహన్ లాల్ లాంటి సూపర్ స్టార్స్ వరకు అందరితోనూ జోడీ కట్టింది ఇంద్రజ. తెలుగు, తమిళం, మలయాళంలో దాదాపు 50 సినిమాలకు పైగానే నటించారు ఈమె. ఇంద్రజకు తెలుగుతో పాటు మిగిలిన భాషల్లోనూ మంచి గుర్తింపు ఉంది. అన్నిచోట్లా ఇంద్రజగానే ప్రేక్షకులకు పరిచయమయ్యారు ఈమె. బ్రాహ్మిణ్ అమ్మాయి అయిన ఇంద్రజ ముస్లిం వ్యక్తి అయిన మహ్మద్ అబ్సర్‌‌ను పెళ్లి చేసుకుని అప్పట్లో హాట్ టాపిక్ అయ్యారు. 
 
ఇదిలా ఉంటే ఈమె అసలు పేరు రాజాతి. చెన్నైలో 1978లో జూన్ 30న జన్మించారు ఈమె. అయితే గూగుల్‌లో అక్టోబ‌ర్ డేట్ వుంద‌ని ఇది త‌ప్ప‌ని ఇటీవ‌లే ఆమె స్టేట్‌మెంట్ ఇచ్చింది. ఇక సంగీతంలోనూ ఇంద్రజకు ప్రవేశం ఉంది. అయితే సినిమాల్లోకి రావడానికి పేరు మార్చుకుంది. కేవలం 15 ఏళ్ల వయసులోనే తమిళ సినిమాతో హీరోయిన్‌గా ప్రస్థానం మొదలుపెట్టారు ఇంద్రజ. ఆ తర్వాత ఎన్నో సినిమాలు చేశారు. అన్నిచోట్లా ఈమె పేరు మాత్రం ఇంద్రజ అనే ఉంటుంది కానీ రాజాతి అని మాత్రం లేదు. చాలా ఏళ్ళ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్‌లో ఇప్పుడిప్పుడే బిజీ అవుతున్నారు ఇంద్రజ. సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన సాఫ్ట్‌వేర్ సుధీర్‌లో హీరో తల్లిగా నటించారు. ఆ తర్వాత అల్లుడు అదుర్స్‌లోనూ తల్లి పాత్రలో నటించారు. 
 
ఇప్పుడు చాలా రోజుల తర్వాత మళ్లీ బుల్లితెరపై కనిపిస్తూ సందడి చేస్తున్నారు. జబర్దస్త్ కామెడీ షోలో జడ్జిగా కొత్త ఇన్నింగ్స్ మొదలు పెట్టారు. మరో జడ్జి రోజా కొన్ని రోజులు బ్రేక్ తీసుకోవడంతో ఇప్పుడు ఆమె స్థానంలో ఇంద్రజ వచ్చారు. సినిమాల మాదిరే జబర్దస్త్‌లోనూ తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు ఇంద్రజ. మంచి జడ్జిమెంట్‌తో అక్కడ కూడా అభిమానులను సంపాదించుకుంటున్నారు ఇంద్రజ. అటు సినిమా ఇటు బుల్లితెర రెండూ త‌న‌కు ప్రాధాన్య‌త‌నేన‌ని చెబుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆగస్టు 10-12 తేదీల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ గ్రామ పంచాయతీలకు ఎన్నికలు

బంధువుల పెళ్లిలో కేంద్ర మంత్రి రామ్మోహన్ స్టెప్పులు (Video)

శ్రీవారికి 2.5 కేజీల బంగారంతో శంకు చక్రాలు... ఆ దాత ఎవరో తెలుసా?

చుట్టూ తోడేళ్లు మధ్యలో కోతిపిల్ల, దేవుడిలా వచ్చి కాపాడిన జీబ్రా (video)

సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ రిలీఫ్... ఏంటది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments