Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జూలై 1న అర్జున్ ‘ఆంజనేయ స్వామి గుడి’ కుంబాభిషేకం

జూలై 1న అర్జున్ ‘ఆంజనేయ స్వామి గుడి’ కుంబాభిషేకం
, మంగళవారం, 29 జూన్ 2021 (13:46 IST)
Action King Arjun
యాక్షన్ కింగ్ అర్జున్ గురించి ప్రత్యేకించి ఏమీ చెప్పనక్కర్లేదు. నాలుగు దశాబ్దాలుగా సౌత్ ఇండియా వెండి తెరపై వినిపిస్తున్న కనిపిస్తున్నపేరిది. నటనతో పాటు సామాజిక సేవలో ముందుండే ఈయన ఇప్పటి వరకూ ఎన్నో సేవా కార్యక్రమాలను ఎలాంటి పబ్లిసిటీ లేకుండా చేసుకుంటూ పోతున్నారు. అర్జున్‌కు ఆంజనేయస్వామి అంటే అపరభక్తి. అందుకే చెన్నై ఎయిర్ పోర్ట్‌కు దగ్గర్లో తన సొంత స్థలంలోనే ఆంజనేయ స్వామి గుడికి శ్రీకారం చుట్టారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా, ఎన్నో సంవత్సరాలుగా రూపొందించిన ఈ గుడి భక్తాదుల సందర్శనార్ధం, సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. జూలై-01న మహా కుంబాభిషేకం జరగనుంది. ఈ సందర్భంగా అర్జన్ తన మిత్రులు, అభిమానులు, అంజన్న భక్తుల కోసం సందేశాన్ని ఓ వీడియో రూపంలో విడుదల చేశారు.
 
మిస్ కాకూడదని లైవ్ స్ట్రీమ్
‘అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. 15 ఏళ్లుగా నేను నిర్మిస్తున్న ఆంజనేయస్వామి దేవాలయం పనులు పూర్తయ్యాయి. ఇందుకు సంబంధించిన కుంబాభిషేకం సమారంభం జూలై- 01, 02న చెన్నైలో జరుపుతున్నాము. ఈ కార్యక్రమానికి మిత్రులు, కుటుంబ సభ్యులు, అభిమానులు, భక్తాదులు, పెద్దలను పిలిచి చాలా గ్రాండ్‌గా చేద్దామనుకున్నాను. కానీ ఇప్పుడుండే కరోనా పరిస్థితుల వల్ల ఎవర్నీ ఆహ్వానించలేకపోతున్నాను. ఈ బృహత్తర సమారంభాన్ని ఎవరూ ఎవరూ మిస్ కాకూడదని లైవ్ స్ట్రీమ్ చేస్తున్నాము. దీనికి సంబంధించిన లింక్స్ జూలై-01,02న నా ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో చూడొచ్చు. అందరూ అంజన్న కృపతో ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుడి దయ అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను’ అని ఓ వీడియోను అర్జున్ విడుదల చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పునర్నిర్మించి జీర్ణోద్ధరణ చేయడం మహా పుణ్యకార్యంః చినజీయర్ స్వామి