కస్టమ్స్ అధికారులు స్మగ్లింగ్ పైన ఎంతటి నిఘా పెట్టినప్పటికీ కేటుగాళ్లు మాత్రం తమ పనిని యధేచ్చగా సాగిస్తున్నారు. తాజాగా చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో దుబాయ్ నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో ఏకంగా 3.15 కిలలో బంగారాన్ని పట్టేశారు.
ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఫ్లైట్ 1X 1644లో 3.15 కిలోల బంగారాన్ని రెండు పార్శిళ్లలో పెట్టుకుని ఇద్దరు తమతమ సీట్ల కింద ఏదో మామూలు సామాగ్రలా పెట్టుకొచ్చారు. ఐతే ఈ బంగారాన్ని ఇంత ధైర్యంగా వారు తమ సీట్ల కిందే పెట్టుకువచ్చారంటే ఇందులో ఎయిర్ పోర్ట్ అధికారుల ప్రమేయం కూడా వుండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా స్వాధీనం చేసుకున్న బంగారం విలువ సుమారు రూ. 1.64 కోట్లు వుంటుందని అంచనా వేస్తున్నారు అధికారులు.