Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పునర్నిర్మించి జీర్ణోద్ధరణ చేయడం మహా పుణ్యకార్యంః చినజీయర్ స్వామి

పునర్నిర్మించి జీర్ణోద్ధరణ చేయడం మహా పుణ్యకార్యంః చినజీయర్ స్వామి
, మంగళవారం, 29 జూన్ 2021 (13:34 IST)
Sri Chinnajiyar Swamy, Director Lakshman Murari, My Home Rameshwara Rao
పురాతన ఆలయాలు పునర్నిర్మించి జీర్ణోద్ధరణ చేయడం మహా పుణ్యమని, భగవంతుడికి అత్యంత ఇష్టమైన ఈ కార్యక్రమాన్ని నిర్వహంచిన శ్రీ పి.ఎస్.ఆర్.టి స్వామి భ్రుందాన్ని అభినందించారు శ్రీమాన్ త్రిదండి చినజీయర్ స్వామి గారు. తురిమెళ్ల గ్రామంలోని ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ డిజిటల్ డాక్యుమెంటరీ CD విడుదల కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామితో పాటు ప్రముఖ పారిశ్రామికవేత్త, భక్తులు మైహోమ్ రామేశ్వర్ రావు గారు పాల్గొన్నారు. 
 
శతాబ్దాల చరిత్ర కలిగిన ఆలయాలు కొన్ని శిథిలావస్థలో చేరుకొని వుంటే ఆస్థలం లోనే ఆలయాన్ని, ధ్వజ స్తంభన్ని, విమాన శిఖర గోపురాలను నిర్మించి, పూర్వపు విగ్రహాల స్థానంలోనే పూర్వపు ముల విరాట్ లను ప్రతిష్టించడం ఒక గొప్ప పుణ్యకార్యం అని శ్రీమాన్ చినజీయర్ స్వామి గారు అన్నారు,
 
 ప్రముఖ చలన చిత్ర దర్శకులు లక్ష్మణ్ మురారి గారు ఇలాంటి అన్ని విషయాలను పొందు పరుస్తూ ఒక ప్రత్యేక మైన డాక్యుమెంటరీ ను రూపొందించారు,  ప్రకాశం జిల్లా, కంభం మండలం లోని తురిమెళ్ల గ్రామంలో  విజయనగర రాజుల కాలంలో నిర్మించిన ప్రసన్న వెంకటేశ్వర స్వామి పురాతన ఆలయం శిథిలావస్థలో చేరుకోవడంతో తురిమెల్ల గ్రామ పెద్దలు శ్రీ P.S.R.T స్వామి వారు, మరియు గ్రామ ప్రజలందరూ  కలిసి శ్రీ చినజీయర్ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఆలయాన్ని పునర్నిర్మించారు, 
 
ఇలా జీర్ణోద్ధరణ కావించబడిన ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయ పున:ప్రారంభ కార్యక్రమాలు ప్రత్యేక మైన పూజలతో ఆడంబరంగా ఎంతో నియమ నిష్ఠలతో తురిమెళ్ళ గ్రామ ప్రజలు గతంలో నిర్వహించారు, ప్రారంభానికి ముందు 6 రోజుల కార్యక్రమంలో గ్రామంలోని ప్రజలు, చుట్టుపక్క గ్రామాల ప్రజలు, బందువులు కలిసి  ప్రతి రోజూ అనేకానేక పూజలు నిర్వహించారు, 
 
ఆలయ ప్రారంభ కార్యక్రమాలనుండి 41 రోజుల మండల పూజ కార్యక్రమాల వరకు జరిగిన ఇత్యాది పూజా కార్యక్రమాలను, అత్యాధునిక 6 కెమెరాలు, fly cam కెమెరాలతో షూట్ చేసి ఒక అద్భుతమైన డాక్యుమెంటరీ నీ రూపొందించారు చిత్ర దర్శకుడు లక్ష్మణ్ మురారి, ఈ డాక్యుమెంటరీ ఆల్బమ్ ను చూసిన ప్రముఖులు  ఈ డాక్యుమెంటరీ లో పూజలు, నియమాలు పొందు పరిచిన తీరు చాలా వైవిద్యంగా, వైదిక కార్యక్రమాలపై సంపూర్ణ అవగాహన కలిగించేదిగా ఉందని,  పురాతన ఆలయాలు పున:నిర్మించి జీర్ణోద్ధరణ చేసే కార్యక్రమాలకు ఈ డాక్యుమెంటరీ మార్గదర్షకంగా వుంటుందని  కొనియాడారు, 
 
దర్శకులు లక్ష్మణ్ మురారి మాట్లాడుతూ, నాకు చిన్నప్పటి నుండి కూడా ఏ విషయాన్నైనా క్షుణ్నంగా  పరిశోధించి తెలుసుకోవడం ఇష్టం అని, ఇంత వరకు తాను రూపొందించిన యెన్నో  డాక్యుమెంటరీలలో ఇధి ఒక ప్రత్యేక స్థానం దక్కింది అన్నారు. రాజకీయ, సమకాలీన, సినిమా అంశాలతో అనేక డాక్యుమెంటరీలు రూపొందించిన నాకు ఆ భగవంతుడే డివోషనల్ సమగ్ర డాక్యుమెంటరీని నాతో రూపొందించానని భావిస్తున్నా అన్నారు.
 
శ్రీ చినజీయర్ స్వామి గారితో పాటు, ప్రముఖ వ్యాపారవేత్త  My Home రామేశ్వర రావు గారి చేతులమీదుగా ఈ డాక్యుమెంటరీ చిత్రం విడుదల చేయడం గర్వంగా వుంది అని, ఈ అవకాశం రావడానికి కారణమైన బాల్య మిత్రుడు జనార్ధన్ సహకారం మరువలేనిదని, అలాగే ఆలయాన్ని పునర్నిర్మించిన శ్రీ.P. S R T Swamy గారికి ప్రత్యేక కృత్గ్నతలు తెలిపారు..
ఈ కార్యక్రమంలో ప్రముఖ చిత్రకారుడు కాంత్ రిసా స్వహస్తాలతో రూపొందించిన శ్రీమాన్ త్రిదండి చినజీయర్ గారి సైకత చిత్రాన్ని ఆవిష్కరించడమే కాక ఆపటం పై స్వామి వారి స్వ హస్తాలతో శ్రీమాన్ నారయణ  అని రాయడం కొసమెరుపు
ఈ కార్యక్రమంలో శ్రీ  MY HOME రామేశ్వర రావు గారు, శ్రీ PSRT స్వామి దంపతులు, కుటుంబ సభ్యులు, సినీ దర్శకుడు బందూక్ లక్ష్మణ్ ఇతర భక్తులు పాల్గొన్నారు,

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భూవివాద కేసులో నిర్మాత సి.కళ్యాణ్‌పై కేసు