Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎక్కువగా వంగకు అనసూయ.. చూడలేం: యాంకర్ సుమ

Advertiesment
ఎక్కువగా వంగకు అనసూయ.. చూడలేం: యాంకర్ సుమ
, మంగళవారం, 29 జూన్ 2021 (11:25 IST)
యాంకర్ సుమ కనకాల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. పైకి కనిపించడానికి సైలెంట్‌గానే ఉంటుంది కానీ ఒక్కసారి పంచులు, సైటైర్లు వేయడంలో దిట్ట. అవతలి వాళ్ల నుంచి పంచ్ రాకముందే.. ఈమె నోటి నుంచి దానికి సెటైర్ కూడా వచ్చేసి ఉంటుంది. అప్పటికప్పుడు అంత వేగంగా పంచులు వేస్తుంది సుమ. ఈ మాటల తూటాలే సుమను ఇప్పటికీ నెంబర్ వన్ యాంకర్‌గా నిలబెట్టాయి. 
 
ఇదిలా ఉంటే తాజాగా మరోసారి తన నోటి పవర్ చూపించింది సుమ. ఇండస్ట్రీలో ఉన్న యాంకర్స్ అంతా కూడా సుమను అక్క అనే పిలుస్తుంటారు. కాస్త కామెడీగా చెప్పాలంటే ఆమెను కులదైవం అంటుంటారు. అంతగా ఫేమస్ అయిపోయింది సుమ. తాజాగా ఈటీవీలో వచ్చే క్యాష్ కూడా ఒకటి. కొన్నేళ్లుగా దీన్ని చాలా సక్సెస్ ఫుల్‌గా రన్ చేస్తుంది సుమ. ఈ వారం క్యాష్ కార్యక్రమంలో మరో స్టార్ యాంకర్ అనసూయ భరద్వాజ్ వచ్చింది. ఆమెతో పాటు స్టార్ కమెడియన్ ప్రియదర్శి, అభినవ్ గోముటం, సీనియర్ హీరోయిన్ ఇంద్రజ కూడా వచ్చారు. ఈ షోలో అనసూయ ఎప్పట్లాగే పొట్టి డ్రెస్‌లోనే వచ్చింది. 
 
సూపర్ గ్లామర్ షో చేస్తూ అదరగొట్టింది. అయితే ఇక్కడే సుమ కూడా దిమ్మతిరిగే పంచ్ వేసింది. ఓ సందర్భంలో సుమ కాళ్లు మొక్కడానికి అనసూయ కాస్త ఒంగింది. దాంతో వెంటనే సుమ పంచ్ వేసింది. ఆఆ చాలు.. అంతకంటే ఎక్కువ వంగకు.. చూడలేం అంటూ మొహం మీదే సెటైర్ వేసింది. దాంతో అనసూయ షాక్ అయిపోయింది. డ్రెస్ మోకాళ్లపైకి ఉండటంతో ఇంకా ఎక్కువ ఒంగితే అసలుకే మోసం వస్తుందని సుమ ఈ పంచ్ వేసింది. ప్రస్తుతం క్యాష్ ప్రోమో బాగా వైరల్ అవుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమలా పాల్ కొత్త బాయ్‌ఫ్రెండ్.. నెట్టింట ఫోటో వైరల్