బంగారం ప్రియులకు షాక్ తగిలింది. కొన్ని రోజులుగా తగ్గుతు వస్తున్న బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. ధరలు తగ్గుముఖం కరోనా వైరస్ తగ్గుముఖం పడుతుండటం, కొన్ని చోట్ల మార్కెట్లు తిరిగి పుంజుకోవడంతో ధరలు పెరిగినట్టు నిపుణులు చెబుతున్నారు.
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 10గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 100 పెరిగి రూ. 44,100కు చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా రూ. 100 పెరిగి రూ. 48,100కు చేరింది. వెండి ధరలు మాత్రం నిలకడగా ఉన్నాయి. కిలో వెండి ధర ప్రస్తుతం రూ.73,400కి చేరింది.
అయితే తాజాగా ఆదివారం దేశీయంగా 10 గ్రాముల బంగారంపై రూ.200 వరకు పెరిగింది. హైదరాబాద్‌తో పాటు మరి కొన్ని ప్రధాన నగరాల్లో రూ.100 మాత్రమే పెరిగింది. ఇక దేశీయంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,300 ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,450 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,490 ఉంది.
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,150 ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,660 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,210 వద్ద ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,100 ఉంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,100 ఉంది.