Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనవరి 29న వస్తోన్న '30 రోజుల్లో ప్రేమించటం ఎలా'

Webdunia
సోమవారం, 11 జనవరి 2021 (15:10 IST)
పాపులర్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు '30 రోజుల్లో ప్రేమించటం ఎలా' అనే సినిమాతో హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసందే. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సుకుమార్ దగ్గర 'ఆర్య 2', '1.. నేనొక్కడినే' చిత్రాలకు పనిచేసిన మున్నా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రదీప్ సరసన నాయికగా అమృతా అయ్యర్ నటించారు. కన్నడంలో పలు సక్సెస్‌ఫుల్ ఫిలిమ్స్ తీసిన ఎస్‌.వి. బాబు ఈ చిత్రాన్ని ఎస్‌.వి. ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించారు.
 
అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి సంబంధించి నిర్మాతలు ఇప్పటివరకూ మూడు పాటలను విడుదల చేశారు. మూడింటికీ ట్రెమండస్ రెస్పాన్స్ లభించింది. ప్రత్యేకించి 'నీలి నీలి ఆకాశం' పాట సంగీత ప్రియులను అమితంగా అలరించి, ఇప్పటివరకూ 218 మిలియన్ వ్యూస్ సాధించడం పెద్ద విశేషం. పాటలన్నింటినీ చంద్రబోస్ రాశారు.
 
లేటెస్ట్‌గా ఓ సరికొత్త పోస్టర్‌తో సినిమా విడుదల తేదీని చిత్ర బృందం ప్రకటించింది. '30 రోజుల్లో ప్రేమించటం ఎలా' జనవరి 29న విడుదలవుతోంది. 'నీలి నీలి ఆకాశం' పాట ఎలాగైతే ఆకట్టుకుందో, సినిమా కూడా ప్రేక్షకుల్ని అలాగే అలరిస్తుందని నిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Odisha Boy: రీల్స్ కోసం రైలు వస్తుంటే రైల్వే ట్రాక్‌పై పడుకున్నాడు.. వీడియో వైరల్

కుటుంబ తగాదాలే చిన్నారి హితీక్ష దారుణ హత్య

బ్రిక్స్ సమావేశంలో ఆవేదన వ్యక్తం చేసిన ప్రధాని మోడీ : ఎందుకు?

Jyoti Malhotra: కేరళ పర్యాటకాన్ని ప్రోత్సహిస్తున్న జ్యోతి మల్హోత్రా.. వీడియో వైరల్

బీహార్ ప్రజల ఓటు హక్కులను లాక్కోవడానికి బీజపీ కుట్ర : కాంగ్రెస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments