Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సీమ అమ్మాయిని పెళ్లాడనున్న ప్రదీప్.. రాజకీయ కుటుంబం నుంచి వస్తోందట..! (Video)

Advertiesment
సీమ అమ్మాయిని పెళ్లాడనున్న ప్రదీప్.. రాజకీయ కుటుంబం నుంచి వస్తోందట..! (Video)
, మంగళవారం, 29 సెప్టెంబరు 2020 (10:23 IST)
ప్రముఖ యాంకర్ ప్రదీప్ పెళ్లి కొడుకు కానున్నాడు. బుల్లితెరపై తనదైన మాటలతో ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న ప్రదీప్.. ఓ బడా రాజకీయ నాయకుడి కుమార్తెను వివాహం చేసుకోబోతున్నాడని తెలిసింది. ప్రస్తుతం ప్రదీప్ కుటుంబం పెళ్లికి సంబంధించిన పనులతో నిమగ్నమైనట్టు ఫిలింనగర్ టాక్. 
 
ఇకపోతే.. తెలుగు బుల్లి తెర సెన్షేషన్‌ ప్రదీప్ అనే చెప్పవచ్చు‌. బుల్లితెర సూపర్‌ స్టార్‌ అంటూ ఇతడికి అమ్మాయిలు ముద్దు పేరు కూడా పెట్టుకున్నారు. అంతటి గుర్తింపును దక్కించుకున్న ప్రదీప్‌ పెళ్లి గురించి బుల్లితెరపై ఆయన నటించే ప్రతీ షోలో కామెంట్స్ వినిపిస్తుంటాయి. ఈ నేపథ్యంలో ప్రదీప్‌కు ఇప్పటికే 'పెళ్లిచూపులు' కార్యక్రమం కూడా జరిగిపోయిందట. ఇక పెళ్లి బాజాలు మోగడమే ఆలస్యమని తెలుస్తోంది.
 
అధికారికంగా ప్రదీప్ ప్రకటించకపోయినా.. అటు బుల్లితెర, ఇటు సినీ వర్గాల్లో కూడా ప్రదీప్ పెళ్లి వార్త మారింది. త్వరలోనే ప్రదీప్ తన పెళ్లి శుభవార్త అందరికీ చెబుతాడని చెప్పుకుంటున్నారు. ఇప్పటివరకూ తెలిసిన సమాచారం ప్రకారం 33 ఏళ్ల ప్రదీప్ ఓ రాజకీయ కుటుంబానికి అల్లుడిగా వెళ్తున్నాడని తెలుస్తుంది. అతను చేసుకోబోయే అమ్మాయి సినిమా, టీవీ రంగాలకు సంబంధం లేని కుటుంబం నుంచి వస్తోందని తెలుస్తోంది. 
 
అంతేగాకుండా రాజకీయాలలో టీడీపీ తరఫున యాక్టివ్‌గా ఉన్న ఒక యువనేత అని తెలుస్తోంది. కాగా, ప్రదీప్ హీరోగా నటించిన తొలి చిత్రం 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
 
ఓ పక్క యాంకరింగ్ చేస్తూనే మరోవైపు తెలుగు సినిమాల్లో అప్పుడప్పుడు చిన్న చిన్న పాత్రలతో ప్రేక్షకుల ముందు కనిపించిన ప్రదీప్ '30 రోజుల్లో ప్రేమించడం ఎలా.?' అనే చిత్రం ద్వారా హీరోగా పరిచయమయ్యాడు. కానీ., ఒక్కసారిగా దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభించడంతో ఈ సినిమా ఇంకా ధియేటర్లలో రిలీజ్ కాకపోయినా ఈ సినిమా ద్వారానే ప్రదీప్ ఓ ఆల్‌టైం రికార్డ్ క్రియేట్ చేసుకోవడం విశేషమని చెప్పాలి.
 
ప్రదీప్ హీరోగా నటించిన ఈ సినిమాలోని 'నీలి నీలి ఆకాశం' సాంగ్ యూట్యూబ్‌లో ఏకంగా 200 మిలియన్ వ్యూస్ దక్కించుకుంది. సౌతిండియాలో ఏ హీరో సాధించలేని రికార్డును హీరోగా తన తొలి సినిమా విడుదల కాకముందే ప్రదీప్ సొంతం చేసుకున్నాడు.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నా నుదిటి మీద ఏమి రాసివుందో నాకేమి తెలుసు? సోను సూద్