Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీ కాళహస్తీశ్వరాలయంలో శివలింగ ప్రతిష్ట.. పెళ్లికాలేదని అలా చేశారట..!

Advertiesment
శ్రీ కాళహస్తీశ్వరాలయంలో శివలింగ ప్రతిష్ట.. పెళ్లికాలేదని అలా చేశారట..!
, మంగళవారం, 22 సెప్టెంబరు 2020 (15:23 IST)
వాయులింగం వెలసిన శ్రీ కాళహస్తీశ్వరాలయంలో.. అక్రమంగా శివలింగ ప్రతిష్ట జరిగింది. ఇందుకు సంబంధించి కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. శ్రీకాళహస్తి ఆలయంలో ఈ నెల 11న అక్రమంగా శివలింగ ప్రతిష్టించిన వ్యవహారం సంచలనం రేపిన నేపథ్యంలో.. ప్రధాన అర్చకుడితో పాటు ఆలయ అధికారులపై ఈవో సస్పెన్షన్‌ వేటు వేసింది. ఈ నేపథ్యంలో అక్రమంగా శివలింగ ప్రతిష్ట ఎందుకు జరిగిందనే అంశం వెలుగులోకి వచ్చింది. 
 
తాజాగా దేవాలయంలో అనధికార విగ్రహాల ఏర్పాటు కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పుత్తూరుకి చెందిన సులవర్ధన్, తిరుమలయ్య, ముని శేఖర్ అనే ముగ్గురు సోదరులను అరెస్ట్ చేసిట్లు పోలీసు ఉన్నతాధికారులు మీడియాకు తెలిపారు. వీరిని పోలీసులు లోతుగా విచారించగా.. జోతిష్యం, మూఢ నమ్మకాలు, వివాహం కాకపోవటంతో ఆలయంలో శివ లింగం, నంది విగ్రహాలను ప్రతిష్టించినట్లు వెల్లడించారు.
 
తిరుపతిలో ఈనెల 2న విగ్రహాలు చేయించి, ఈనెల 6న ఆలయంలో పెట్టినట్లు విచారణలో పోలీసులు తేల్చారు. సీసీ టీవీ విజువల్స్, ద్విచక్రవాహనాల నెంబర్లు ఆధారంగా నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుండి రెండు ద్విచక్రవాహనాలు, మూడు సెల్ ఫోన్‌లు సీజ్ చేసినట్లు తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డి కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వారంలో ఆరు రోజులు సబ్‌రిజిస్ట్రార్, ఆదివారం వ్యవసాయ కూలీ