Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభావ్ కొత్త చిత్రం పేరు 'స్పిరిట్'

Webdunia
గురువారం, 7 అక్టోబరు 2021 (11:35 IST)
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తన 25వ చిత్రం టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రానికి స్పిరిట్ అనే టైటిల్‌నను ఖరారు చేశారు. దర్శకుడుగా సందీప్ రెడ్డి వంగాను ఎంపిక చేశారు. టి సిరీస్ అధినేత భూషణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అయితే, ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నారు. 
 
ఇదిలావుంటే, 'ఆదిపురుష్' అప్డేట్‌ను 'డార్లింగ్' బర్త్‌డే గిప్టుగా వెల్లడించనున్నారు. ఇపుడు అన్నీ పాన్ ఇండియా మూవీల్లోనే నటిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పట్టాలెక్కించిన ప్రాజెక్టులలో 'సలార్', 'ఆదిపురుష్' ఉన్నాయి. 
 
ఈ రెండు సినిమాలు పూర్తిగా డిఫరెంట్ జోనర్లకు చెందినవి. ఇక ఈ నెల 23వ తేదీన ప్రభాస్ పుట్టినరోజూ కావడంతో, ఆయన సినిమాల నుంచి రానున్న అప్‌డేట్ల కోసం అంతా ఆసక్తితో ఉన్నారు. ముఖ్యంగా ప్రభాస్ బర్త్‌డే రోజున 'ఆదిపురుష్' నుంచి శ్రీరాముడి గెటప్‌తో ప్రభాస్ ఫస్టులుక్ రావొచ్చనే టాక్ వినిపిస్తుంది. 
 
ప్రస్తుతం ఈ సినిమా షూటింగు చాలా వేగంగా జరుగుతోంది. రీసెంట్‌గా ప్రభాస్ పాల్గొనగా కొన్ని పోరాట సన్నివేశాలను చిత్రీకరించారు. సీతాదేవి పాత్రలో కృతిసనన్ .. రావణుడి పాత్రలో సైఫ్ అలీఖాన్ కనిపించనున్న సంగతి తెలిసిందే.
 
ఇక ప్రభాస్ తాజా చిత్రంగా విడుదలకు సిద్దమైన 'రాధేశ్యామ్' నుంచి, చిత్రీకరణ పరంగా 50 శాతానికిపైగా పూర్తయిన 'సలార్' నుంచి కూడా ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ రావొచ్చని అంటున్నారు. 'రాధే శ్యామ్'లో కథానాయికగా పూజ హెగ్డే అలరించనుండగా, 'సలార్'లో శ్రుతి హాసన్ కనువిందు చేయనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్ కళ్యాణ్‌పై దువ్వాడ వివాదాస్పద వ్యాఖ్యలు : నోటీసులిచ్చిన పోలీసులు

ఆత్మార్పణ చేసుకుంటే దేవుడుకి దగ్గరవుతాం... స్వర్గం ప్రాప్తిస్తుందంటూ మహిళ ఆత్మహత్య

కన్నడ నటి రమ్యపై అత్యాచార బెదిరింపులు.. ముగ్గురు అరెస్ట్.. దర్శన్ ఏం చేస్తున్నారు?

జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ గుండెపోటు వచ్చింది.. వ్యాయామం చేస్తుండగా కుప్పకూలిపోయాడు.. (video)

హిమాచల్ ప్రదేశ్‌లో ఆకస్మిక వరదలు- కాఫర్‌డ్యామ్ కూలిపోయింది.. షాకింగ్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments