Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఆదిపురుష్' అప్డేట్ - 'డార్లింగ్' బర్త్‌డే గిప్టుగా...

Webdunia
గురువారం, 7 అక్టోబరు 2021 (11:26 IST)
ఇంటర్నేషనల్ స్టార్‌గా మారిపోయిన డార్లింగ్ ప్రభాస్ రేంజ్‌ ఎక్కడికో వెళ్లిపోయింది. ఆయన ఇపుడు అన్నీ పాన్ ఇండియా మూవీల్లోనే నటిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పట్టాలెక్కించిన ప్రాజెక్టులలో 'సలార్', 'ఆదిపురుష్' ఉన్నాయి. 
 
ఈ రెండు సినిమాలు పూర్తిగా డిఫరెంట్ జోనర్లకు చెందినవి. ఇక ఈ నెల 23వ తేదీన ప్రభాస్ పుట్టినరోజూ కావడంతో, ఆయన సినిమాల నుంచి రానున్న అప్‌డేట్ల కోసం అంతా ఆసక్తితో ఉన్నారు. ముఖ్యంగా ప్రభాస్ బర్త్‌డే రోజున 'ఆదిపురుష్' నుంచి శ్రీరాముడి గెటప్‌తో ప్రభాస్ ఫస్టులుక్ రావొచ్చనే టాక్ వినిపిస్తుంది. 
 
ప్రస్తుతం ఈ సినిమా షూటింగు చాలా వేగంగా జరుగుతోంది. రీసెంట్‌గా ప్రభాస్ పాల్గొనగా కొన్ని పోరాట సన్నివేశాలను చిత్రీకరించారు. సీతాదేవి పాత్రలో కృతిసనన్ .. రావణుడి పాత్రలో సైఫ్ అలీఖాన్ కనిపించనున్న సంగతి తెలిసిందే.
 
ఇక ప్రభాస్ తాజా చిత్రంగా విడుదలకు సిద్దమైన 'రాధేశ్యామ్' నుంచి, చిత్రీకరణ పరంగా 50 శాతానికిపైగా పూర్తయిన 'సలార్' నుంచి కూడా ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ రావొచ్చని అంటున్నారు. 'రాధే శ్యామ్'లో కథానాయికగా పూజ హెగ్డే అలరించనుండగా, 'సలార్'లో శ్రుతి హాసన్ కనువిందు చేయనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments