భారతదేశంలో ఆధ్యాత్మిక గురువు రవిశంకర్ ఉపదేశాలను, ఆయన చేస్తున్న యోగ పాఠాలను ఎందరో అనుకరిస్తుంటారు. ముఖ్యంగా ప్రధాని నుంచి ముఖ్యమంత్రుల వరకు ఆయన ఆదేశాలను శిరసా వహిస్తారు. ఆధ్యాత్మిక బాబా ల తర్వాత అంత రేంజ్‌లో పేరున్న వ్యక్తి ఆయన. 65 ఏళ్ళ ఆయన జీవితంలో ఎంతోమంది గురువులను కలిసి జ్ఞానాన్ని సంపాదించుకున్నారు. తమిళనాడుకు చెందిన ఆయన ఎందరికో ఆదర్శప్రాయం. ఆయన పుట్టినరోజు ఈనెల 13వతేదీ. ఈ సందర్భంగా బాలీవుడ్ నిర్మాత కరణ్‌జోహార్ ఆయన బయోపిక్ చేయడానికి సిద్ధమయ్యాడు. ఈ సందర్భంగా లాంఛనంగా రవి శంకర్ పుట్టినరోజు ప్రకటించినట్లు సమాచారం.
రవిశంకర్ అసలు పేరు రవి. ఆయన ఆదివారంనాడు పుట్టాడు. సన్ కు గుర్తు. ఆయన ఎంతో ఎత్తు ఎదుగుతారని చిన్నతనంలో గురువులు చెప్పారట. ఆయన మొదటి గురువు సుధాకర్ చతుర్వేది. ఈయన మహాత్మాగాంధీకి మంచి సన్నిహితుడు. అనంతరం రవిశంకర్ బెంగుళూరులో బి.ఎస్.పి. అభ్యసించారు. ఆ తర్వాత ఆయనకు మహర్షి మహేశ్ గురువుగా లభించాడు. ఆ తర్వాత అతని జీవితంల ఏవిధమైన మలుపు తిరిగిందనేది వెండితెరపై ఆవిష్కరిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈనెల 25న కరణ్ జోహార్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన ఈ సినిమా గురించి అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.