బాలీవుడ్ అగ్రనటి కంగనా రనౌత్.. ఏ విషయాన్నైనా ధీటుగా మాట్లాడగలుగుతుంది. గతంలో మీటూ వ్యవహారంపై గట్టిగా మాట్లాడిన ఈమె ప్రస్తుతం బాలీవుడ్‌లోని నెపోటిజంపై నోరు విప్పింది. బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ మరణించినప్పటి నుండి అనేక విషయాలపై నిర్భయంగా మాట్లాడుతుంది.
బాలీవుడ్‌లోని కొందరు బడా బాబులు సుశాంత్‌ని మానసికంగా ఇబ్బందికి గురిచేసారని, ఈ కారణంతోనే ఆయన మరణించాడని ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసింది. తాజాగా ముఖ్యమంత్రి కుమారుడిని టార్గెట్ చేస్తూ వ్యంగాస్త్రాలు విసిరింది. ఇప్పుడు కంగనా వ్యాఖ్యలు ఇండస్ట్రీలోనే కాక రాజకీయాలలోను హాట్ టాపిక్‌గా మారాయి.
కంగనా తాజాగా తన సోషల్ మీడియా పేజ్‌లో.. సుశాంత్ ఆత్మహత్యకు ముందు రోజు రాత్రి ఆయన ఇంట్లో పార్టీ జరిగింది. ఆ పార్టీలో కర్‌ణ జోహార్ బెస్ట్ ఫ్రెండ్, ప్రపంచంలోని గొప్ప ముఖ్యమంత్రి తనయుడు పాల్గొన్నాడు. ఈ విషయం అందరికి తెలుసు. కాని ఎవరు చెప్పరు. ఆయనని బెబీ పెంగ్విన్ అని ముద్దుగా పిలుస్తారు.
ఒకవేళ నేను నా ఇంట్లో ఉరివేసుకొని కనిపిస్తే, అది ఆత్మహత్య అని మాత్రం అనుకోకండి కంగనా రాసుకొచ్చింది . కంగనా చేసిన వ్యాఖ్యలు మంత్రి ఆదిత్య ఠాక్రేను ఉద్దేశించి మాట్లాడిందని జనాలు చెవులు కొరుక్కుంటున్నారు.