Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆధ్యాత్మిక సూక్తులు: మీ శ్రీమతితో చెప్పకుండా ఆ పని చేయొద్దు

Advertiesment
ఆధ్యాత్మిక సూక్తులు: మీ శ్రీమతితో చెప్పకుండా ఆ పని చేయొద్దు
, మంగళవారం, 1 జూన్ 2021 (22:16 IST)
ఆధ్యాత్మికపరంగా పెద్దలు కొన్ని నియమాలను పాటించాలని చెప్పారు. వాటి వెనుక ఎంతో పరమార్థం దాగి వుంటుంది. అలాంటి వాటిలో కొన్నింటిని చూద్దాం. మీ శ్రీమతితో చెప్పకుండా ఇంటికి భోజనానికి ఎవర్ని పిలవకూడదు.
 
శుభానికి వెళ్తున్నప్పుడు స్రీలు ముందుండాలి. అశుభానికి స్రీలు వెనక వుండాలి. ఉదయం పూట చేసే దానకార్యాలు ఏవైనా సరే ఎక్కువ ఫలన్నిస్తాయి. అమంగళాలు కోపంలోను, ఆవేశంలోను ఉచ్చారించకూడదు. తదాస్తు దేవతలు ఆ పరిసరాల్లో సంచరిస్తూ వుంటారు. పెరుగును చేతితో చిలికి మజ్జిగ చేసే ప్రయత్నం ఎన్నడూ చేయకూడదు.
 
పిల్లి ఎదురొస్తే కొన్ని నిముషాలు ఆగి బయలుదేరాలి. కుక్క ఎదురొస్తే నిరభ్యంతరంగా ముందుకు సాగాలి. చూపుడు వేలితో బొట్టు పెట్టుకోరాదు. పగలు ధనాన్ని సంపాదించాలి. రాత్రి సుఖాలను పొందేందుకు సిద్ధపడాలి.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తులసి మాలను ధరిస్తున్నారా? ఇవి తీసుకోకూడదు..