Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీదేవి భర్త బోనీ కపూర్ నివాసంలో ముగ్గురికి కరోనా

Webdunia
శుక్రవారం, 22 మే 2020 (16:54 IST)
దివంగత నటి శ్రీదేవి భర్త, బాలీవుడ్ స్టార్ నిర్మాత బోనీ కపూర్ నివాసంలో పని చేసే ముగ్గురికి కరోనా వైరస్ సోకింది. ఇప్పటికే ఆయన నివాసంలో పని చేసే చరణ్ సాహు అనే వ్యక్తికి పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించి క్వారంటైన్‌లో ఉంచారు. ఇపుడు ఇంట్లో పని చేసే మరో ఇద్దరు పని మనుషులకు ఈ వైరస్ సోకినట్టు తేలింది. దాంతో బోనీ నివాసంలో కరోనా బాధితుల సంఖ్య మూడుకు చేరింది. 
 
శ్రీదేవి - బోనీకపూర్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు జాన్వీ, ఖుషీలతో కలిసి ముంబైలోని లోఖండ్ వాలా ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. ఇటీవల చరణ్ సాహు అనే పనిమనిషి అనారోగ్యం పాలవడంతో కరోనా టెస్టు చేయగా, పాజిటివ్ అని తేలింది. 
 
దాంతో ఇంట్లో అందరికీ కరోనా పరీక్షలు నిర్వహించగా, మరో ఇద్దరికి కూడా వ్యాధి సోకినట్టు గుర్తించారు. బోనీ, జాన్వీ, ఖుషీలకు వైద్య పరీక్షలో నెగెటివ్ వచ్చిందని వారి ప్రతినిధి తెలిపారు. ప్రస్తుతం బోనీ, జాన్వీ, ఖుషీ హోం క్వారంటైన్‌లో ఉన్నారని వెల్లడించారు. 
 
కాగా, మహారాష్ట్రలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తున్న విషయం తెల్సిందే. దేశంలోనే అత్యధిక కరోనా కేసులు నమోదైన రాష్ట్రంగా మహారాష్ట్ర రికార్డుకెక్కింది. ముఖ్యంగా ముంబై మహానగరంలో ఈ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత నుంచి చుక్కనీరు పోనివ్వం... అన్నీ మేమే వాడుకుంటాం : ప్రధాని మోడీ

1971 యుద్ధం తర్వాత కలిసికట్టుగా త్రివిధ దళాల దాడులు

Operation Sindoor: స్పందించిన సెలెబ్రిటీలు... జై హింద్ ఆపరేషన్ సింధూర్

భారత సైన్యం ధ్వంసం చేసిన ఉగ్రస్థావరాలు ఇవే...

#OperationSindoor ఢిల్లీలో హై అలర్ట్- పంజాబ్‌లో విమానం కూలింది.. ఏమైంది? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments