Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రియుడికి 26 - ఆమెకు 40 .. పెళ్లి చేసుకోమని వెంటపడిందనీ చంపేశాడు... ఎక్కడ?

Advertiesment
Hyderabad
, శుక్రవారం, 22 మే 2020 (09:16 IST)
అతనికి 26 యేళ్లు. ఆమెకు 40 యేళ్లు. ఇద్దరూ ఫేస్‌బుక్‌ చాటింగ్‌లో కలుసుకున్నారు. ఈ చాటింగ్ వారిద్దరి మధ్య మంచి స్నేహానికి దారితీసింది. స్నేహం ముసుగులో ఆ యువకుడి మాటలకు ఆమె పడిపోయింది. అలాగే, ఆమె అందానికి ఆ కుర్రోడు దాసోహమయ్యాడు. ఫలితంగా వారిద్దరూ ఒకరిపై ఒకరు మనస్సుపడ్డారు. ఈ క్రమంలో 40 యేళ్ల ప్రియురాని తాను ఉండే ఊరికి పలు మార్లు రప్పించి... శారీరకంగా కలిశారు. 
 
ఆ తర్వాత తనను పెళ్లి చేసుకోవాలని 40 యేళ్ళ మహిళ 26 యేళ్ళ యువకుడిపై ఒత్తిడి చేసింది. ఆమెను పెళ్లి చేసుకోవడం ఇష్టంలేదని చెప్పి, తమ మధ్య 14 యేళ్ళ వ్యత్యాసం ఉందన్న సాకు చూపించాడు. అప్పటికీ వదలకపోవడంతో ఆమె అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ వేశాడు. తన ప్లాన్‌లో భాగంగా, ఓ స్నేహితుడి సహాయం తీసుకుని ఆ మహిళను హత్య చేశాడు. ఇదే హైదరాబాద్ నగరంలోని చేవెళ్ళ తంగిడిపల్లి వంతెన కింద పోలీసులు కనుగొన్న గుర్తు తెలియని మహిళ శవం కేసు. ఈ కేసులోని మిస్టరీని పోలీసులు ఛేదించారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
40 యేళ్ళ మహిళ పేరు పాసీ శెర్పా. సిక్కిం రాష్ట్రం. సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌. ఈమెకు ముంబైకి చెందిన ఓ 26 యేళ్ళ యువకుడు ఫేస్‌బుక్‌లో పరిచయమయ్యాడు. వారిద్దరి మధ్య సాగిన చాటింగ్ కాస్త స్నేహంగా మారింది. ఈ స్నేహం ముసుగులో యువకుడు ఆమె అందాన్ని పొగిడాడు. అంతే ఆమె పడిపోయింది. 
 
అతనితో తన బాధలు చెప్పుకుంది. దీన్ని ఆసరాగా చేసుకున్న యువకుడు.. మాయ మాటలతో ఆమెను ట్రాప్‌ చేశాడు. అతని వలలోకి రాగానే.. ఆమెను రెండు సార్లు ముంబైకి పిలిపించుకుని, శారీరకంగా కలిశారు. అతని మోజులో పడిన శెర్పా... భర్త, ఇద్దరు పిల్లలను వదిలేసి యువకుడిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైంది. 
 
అయితే.. పెండ్లి చేసుకోవడం ఇష్టం లేని యువకుడు.. నీకు నాకు మధ్య చాలా వయస్సు తేడా ఉంది... నేను మరో పెండ్లి చేసుకుంటాను.. అని చెప్పాడు. అయినా శెర్పా.. తననే పెండ్లి చేసుకోమని వెంట పడింది. దీంతో శెర్పాను వదిలించుకునేందుకు ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకుని.. అందుకు స్కెచ్‌ వేశాడు. దీని కోసం హైదరాబాద్‌లోని తన స్నేహితుడిని పావుగా వాడుకున్నాడు.
 
అతని సహకారంతో మార్చి 16వ తేదీనం హైదరాబాద్‌కు తీసుకొచ్చి తన స్నేహితుడు సహాయంతో చంపేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని చేవెళ్ల తంగిడిపల్లి వంతెన కింద పడేసి, ఏమీ తెలియనట్టుగా మార్చి 17వ తేదీన ముంబైకు వెళ్లిపోయాడు. ఆ తర్వాత పోలీసులు సమచారం అందుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీనిపై విచారణ చేపట్టగా, అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ప్రధాన నిందితుడు ముంబైలో ఉండటంతో కరోనా కారణంగా అరెస్టు చేయలేకపోయారు. కానీ, అతనికి సహకరించిన హైదరాబాద్‌కు అక్తర్ బారీని మాత్రం పోలీసులు అరెస్టు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జంతువుల నుంచే 75 శాతం ఇన్‌ఫెక్షన్లు