ప్రముఖ నిర్మాత, శ్రీదేవి భర్త బోనీ కపూర్ ఇంట కరోనా కలకలం సృష్టిస్తోంది. బోనీ కపూర్ ఇంట్లో పని చేస్తున్న 23 ఏళ్ల యువకుడు చరణ్ సాహూ ఉన్నట్టుండి అస్వస్థతకు గురయ్యాడు. వైద్య పరీక్షల నిర్వహించగా కరోనా వైరస్ పరీక్షలో పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం అతన్ని ఐసోలేషన్ వార్డులో ఉంచారు. టెస్టుల్లో పాజిటివ్ రావడంతో ముంబై కార్పోరేషన్ అధికారులు అతన్ని క్వారంటైన్ సెంటర్‌కి తరలించారు.
దీనిపై స్పందించిన బోనీకపూర్ తాను, తన కుమార్తెలు, ఇంట్లో వున్న ఇతర సిబ్బంది అందరూ క్షేమంగా వున్నామని.. తమకు ఎలాంటి వైరస్ లక్షణాలు లేవని చెప్పుకొచ్చారు. లాక్‌డౌన్ ప్రారంభమైనప్పటి నుంచీ తాము ఇంట్లోనే ఉన్నామని తెలిపారు. బీఎంసీ, వైద్యాధికారుల సూనలను తాము విధిగా పాటిస్తున్నామని, చరణ్ సాహూ సైతం త్వరగా కోలుకుని తమ వద్దకు చేరతాడని భావిస్తున్నామని బోనీ కపూర్ ఆశాభావం వ్యక్తం చేశారు.