Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పుల్వామా దాడితో బలమైన నేత .. కరోనా దృఢమైన నేతగా ఆవిష్కరించింది..

Advertiesment
పుల్వామా దాడితో బలమైన నేత .. కరోనా దృఢమైన నేతగా ఆవిష్కరించింది..
, సోమవారం, 18 మే 2020 (19:33 IST)
ప్రపంచంలోనే అత్యంత ప్రజధారణ పొందిన నేతగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గుర్తింపు పొందారు. ఈ మేరకు అమెరికాకు చెందిన ప్రముఖ పత్రిక న్యూయార్క్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. ముఖ్యంగా, పుల్వామా దాడితో మోడీ బలమైన నేతగా ఎదిగితే.. కరోనా సంక్షోభంలో దృఢమైన నేతగా అవతరించారని ఆ పత్రిక కొనియాడింది. పైపెచ్చు.. ప్రపంచ అగ్రనేతల డోనాల్డ్ ట్రంప్, వ్లాదిమిర్ పుతిన్‌ల కంటే కూడా నరేంద్ర మోడీ బలమైన నేతగా మారినట్టు పేర్కొంది. 
 
ప్రధాని మోడీ గురించి న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన కథనాన్ని పరిశీలిస్తే, ప్రస్తుత పరిస్థితుల్లో అత్యధికులు మోడీనాయకత్వాన్నే బలపరుస్తున్నారని తెలిపింది. ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తే దాదాపు 90 శాతం మంది మోడీ నిర్ణయాలకే మద్దతు పలుకుతున్న విషయం తేలిందని న్యూయార్క్ టైమ్స్ వివరించింది.
 
ముఖ్యంగా, ప్రపంచ అగ్రనేతలుగా ఉనన డొనాల్డ్ ట్రంప్, రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్‌ల కంటే మోడీ ప్రజాదరణ అమోఘమైన రీతిలో పైకెగబాకుతోందని వ్యాఖ్యానించారు. 2019లో మోడీ తిరిగి ఎన్నికయ్యాక పుల్వామా దాడి ఘటన ఆయన్ను బలమైన నేతగా నిలిపితే, తాజా కరోనా సంక్షోభం మరింత దృఢమైన నాయకుడిగా ఆవిష్కరించిందని ఆ కథనంలో పేర్కొంది. 
 
అయితే ఎంత ప్రజాదరణ ఉన్నా ఎప్పుడూ నియంతగా వ్యవహరించలేదని, ఓ కర్తవ్య ప్రబోధకుడిగానే ఉన్నారని కొనియాడారు. అందుకే ఆయన ఒక్క పిలుపు ఇవ్వగానే దేశం మొత్తం మరో మాటకు తావులేకుండా పాటిస్తున్నారని, జనతా కర్ఫ్యూ పాటిద్దాం అనగానే, భారత ప్రజలు అక్షరాలా కర్ఫ్యూ పాటించి చూపారని న్యూయార్క్ టైమ్స్ కొనియాడింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాశ్మీర్‌లో ఐదుగురు వైద్యులకు కరోనా- 3నెలలు కర్ఫ్యూ.. ఎక్కడ?