Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

17-05-2020 ఆదివారం మీ రాశి ఫలితాలు.. అలా మసలుకోవడం మంచిది..?

Advertiesment
17-05-2020 ఆదివారం మీ రాశి ఫలితాలు.. అలా మసలుకోవడం మంచిది..?
, ఆదివారం, 17 మే 2020 (05:00 IST)
Astrology
సూర్య స్తుతి పూజించడం వల్ల మీ సంకల్పం సిద్ధిస్తుంది. 
 
మేషం: చేతి వృత్తులు, చిరువ్యాపారులకు అన్నివిధాలా కలిసిరాగలదు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అనుకూలిస్తాయి. ఎదుటివారి తీరును గమనించి వ్యవహరించండి. స్త్రీలకు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం. మీ కార్యక్రమాలు వాయిదా పడతాయి ప్రేమికులు అతిగా వ్యవహరించి ఇబ్బందులకు గురవుతారు. 
 
వృషభం: వ్యాపారాల్లో పెరిగిన పోటీ ఆందోళన కలిగిస్తుంది. ఏ విషయంలోను హామీ ఇవ్వకుండా లౌక్యంగా దాటవేయండి. సంఘంలో మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది. ఉద్యోగస్తులకు విశ్రాంతి లభిస్తుంది. మీ చిన్నారుల భవిష్యత్ గురించి తగు శ్రద్ధ తీసుకుంటారు. రాజకీయ నాయకులకు ప్రయాణాల్లో మెళకువ అవసరం.
 
మిథునం: మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. మీ సంతానం మీతో అన్ని విషయాల్లోనూ ఏకీభవిస్తారు. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. ప్రముఖులకు బహుమతులు అందజేస్తారు. వాహనం నడుపుతున్నప్పుడు ఏకాగ్రత అవసరం. 
 
కర్కాటకం: భాగస్వామిక చర్చల్లో కొత్త ప్రతిపాదనలు చోటుచేసుకుంటాయి. గృహానికి కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. సమావేశానికి ఏర్పాటు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. విద్యార్థులకు హడావుడి, తొందపాటు తగదు. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు.
 
సింహం: కపటంలేని మీ ఆలోచనలు, సలహాలు మీకు అభిమానుల్ని సంపాదించి పెడుతుంది. మొక్కుబడులు, దైవకార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారాల్లో పెరిగిన పోటీ ఆందోళన కలిగిస్తుంది. రవాణా రంగాల్లోని వారికి మెళకువ అవసరం. నిరుద్యోగులకు ఎలాంటి అవకాశం లభించినా సద్వినియోగం చేసుకోండి. 
 
కన్య: రాజకీయ నాయకులకు మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది. కొన్ని వ్యవహారాలు అనుకూలించినా మరికొన్ని ఆందోళన కలిగిస్తాయి. స్త్రీలు తమ ఉత్సాహాన్ని అదుపులో వుంచుకోవడం శ్రేయస్కరం. మనుషుల మనసత్త్వం తెలుసుకుని మసలు కోవడం మంచిది. పాత మిత్రుల కలయికతో గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. 
 
తుల : దైవ కార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కళ, క్రీడా రంగాల వారికి ప్రోత్సాహకరం. ఆకస్మికంగా ప్రయాణం చేస్తారు. సాహస ప్రయత్నాలు విరమించండి. బంధువుల రాకపోకలు అధికం. పెరిగిన ధరలు, చాలీచాలని ఆదాయంతో సతమతమవుతారు. నూతన పరిచయాలు మీ ఉన్నతికి తోడ్పడుతాయి.
 
వృశ్చికం: ఆర్థికంగా బాగుగా స్థిరపడతారు. ఉద్యోగస్తులకు హోదా పెరగడం, కోరుకున్న చోటికి బదిలీ వంటి శుభపరిణామాలుంటాయి. స్త్రీలలో మితంగా సంభాషించండి. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. రిప్రజెంటివ్‌లకు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు ఆశాజనకం. వృత్తి వ్యాపారాల్లో రాణిస్తారు. 
 
ధనస్సు: వస్త్ర, బంగారం, ఫ్యాన్సీ, గృహోపకరణ వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. పాతమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. విందులలో పరిమితి పాటించండి. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాల్లో మెళకువ అవసరం. సంఘంలో మీ మాటకు మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రముఖుల ఇంటర్వ్యూల కోసం పడిగాపులు పడతారు. 
 
మకరం: రిప్రజెంటేటివ్‌లకు, ప్రైవేట్ సంస్థల్లోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. బంధుమిత్రుల నుంచి ఒత్తిడి, మొహమ్మాటం ఎదురవుతాయి. పెద్దల ఆరోగ్యం నిరుత్సాహపరుస్తుంది. ఏ వ్యక్తికీ అతి చనువు ఇవ్వడం మంచిది కాదు. నిరుద్యోగులు ఇంటర్వ్యూ లేఖలు అందుకుంటారు. స్త్రీలకు పనిభారం అధికం. 
 
కుంభం: ఆర్థిక లావాదేవీలు, కీలకమైన వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. రాజకీయనాయకులు పార్టీ సభ్యులతో ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. సొంతంగా వ్యాపారం చేయాలనే మీ ఆలోచన స్ఫురిస్తుంది. బంధువులను కలుసుకుంటారు. 
 
మీనం: మీ ఉన్నతిని చాటుకోవడం కోసం ధనం విరివిగా వ్యయం చేయాల్సి వస్తుంది. మీరు చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం పొందుతారు. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. గృహ మరమ్మతులు, మార్పులు, చేర్పులు వాయిదా పడతాయి. వ్యవహార దక్షత, పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

16-05-2020 శనివారం దినఫలాలు - సత్యదేవుడిని పూజిస్తే...