Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

13-05-2020 బుధవారం దినఫలాలు - గాయత్రీ మాతను ఆరాధించినా...

Advertiesment
13-05-2020 బుధవారం దినఫలాలు - గాయత్రీ మాతను ఆరాధించినా...
, బుధవారం, 13 మే 2020 (05:00 IST)
మేషం : వ్యాపారాల్లో పెరిగిన పోటీ ఆందోళన కలిగిస్తుంది. ఏ యత్నం కలిసిరాకపోవడంతో నిరుద్యోగులు నిరుత్సారం చెందుతారు. మీ సంతానంపై చదువుల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. వాహనం వీలైనంత నిదానంగా నడపడం క్షేమదాయకం. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి, ప్రోత్సాహం లభిస్తాయి. 
 
వృషభం : చిట్స్, ఫైనాన్స్ వ్యాపారులకు ఖాతాదారుల ఒత్తిడి అధికంగా ఉంటుంది. సభలు, సమావేశాల్లో కొత్త పరిచయాలేర్పడతాయి. రాబడి పెంచుకునే విధంగా యత్నాలు సాగిస్తారు. ప్రేమికులకు పెద్దల ఆమోదం సన్నిహితుల ప్రోత్సాహం లభిస్తాయి. ఒకానొక సందర్భంలో సోదరుల మాటతీరు మనస్తాపం కలిగిస్తుంది. 
 
మిథునం : మీ కుటుంబానికి మీరు అవసరం కనుక వ్యసనాలకు దూరంగా ఉండండి. స్త్రీలకు ఎదుటివారి వేషధారణ చూసి మోసపోయే ఆస్కారం ఉంది. సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రైవేటు సంస్థలలోని వారు ఎంత శ్రమించినా యాజమాన్యం నుంచి ఆశించిన స్పందన ఉండదు. 
 
కర్కాటకం : కొంతమంది మీ ప్రతిష్టను దిగజార్చేందుకు యత్నిస్తారు. కాంట్రాక్టులకు సంబంధించి ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది. స్త్రీలకు పనిభారం అధికం. దూరపు బంధువుల నుంచి కాలవలసిన సమాచారం అందుకుంటారు. 
 
సింహం : వ్యాపారాల్లో నష్టాలు తొలగి గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు. ఇతరుల విషయాలకు దూరంగా ఉండటం మంచిది. విదేశాలకు వెళ్లే యత్నాలు వాయిదాపడతాయి. కొన్ని అవకాశాలు అనుకోకుండా కలసివస్తాయి. అయిన వారితో విభేదాలు తలెత్తుతాయి. స్త్రీల అవసరాలు, మనోవాంఛలు నెరవేరుతాయి. 
 
కన్య : సంఘంలో పలుకుబడిన వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు. కాంట్రాక్టుల విషయంలో అనుభవజ్ఞుల సలహా పాటించడం మంచిది. ఒక కార్యం సఫలం కావడంతో మీలో మనోధైర్యం నెలకొంటుంది. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. మొండిబాకీలు వసూలులో శ్రమాధిక్యత, ప్రయాసలెదుర్కొంటారు. 
 
తుల : నిరుద్యోగుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. వ్యాపారాల్లో నిలదొక్కుకోవడానికి బాగా శ్రమించవలసి ఉంటుంది. బ్యాంకు వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. ట్రాన్స్‌పోర్టు, ట్రావెలింగ్ రంగాల వారికి ఊహించని సమస్యలు తలెత్తుతాయి. స్త్రీలకు పనివారలతో చికాకులు తప్పవు. వాహనం నిదానంగా నడపటం మంచిది. 
 
వృశ్చికం : ఉద్యోగస్థులకు ఓర్పు, నేర్పుకు పరీక్షా సమయం అని గమనించండి. సభా సమావేశాలలో పాల్గొంటారు. కొంత ఆలస్యంగానైనా చేపట్టిన పనులు సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. విద్యార్థులకు ఉన్నత విద్యలలో ప్రవేశం కోసం ఒత్తిడి, ఆందోళన ఎదుర్కోక తప్పదు. 
 
ధనస్సు : హోటల్, తినుబండరాలు, పండ్లు, పూలు, కూరగాయల వ్యాపారులకు కలిసివచ్చే కాలం. పాడిపశువులు, పెంపుడు జంతువుల విషయంలో ఆందోళన చెందుతారు. ఏదైనా అమ్మటానికై చేయు ప్రయత్నాలు వాయిదాపడతాయి. స్త్రీలకు పనిభారం అధికం ఆపడం వల్ల ఆరోగ్యంలో ఇబ్బందులు వంటివి తలెత్తుతాయి. 
 
మకరం : వస్త్ర, కళంకారీ, పీచు, చిన్నతరహా పరిశ్రమల్లో వారికి కలిసివచ్చే కాలం. తొందరపడి వాగ్ధానాలు చేయడం వల్ల ఇబ్బందులు తప్పవు. బంధు, మిత్రుల కలయికతో మీలో నూతనోత్సాహం చోటుచేసుకుంటుంది. కాంట్రాక్టర్లకు నిర్మాణ పనుల్లో ఇంజనీరింగ్ అధికారుల నుంచి అభ్యంతరాలెదురవుతాయి. 
 
కుంభం : దంతాలు, కళ్లు, నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొంటారు. ఉపాధ్యాయులకు బదిలీ ఉత్తర్వులు చేతికందుతాయి. పత్రికా సంస్థలలోని వారికి ఏకాగ్రత ముఖ్యం. ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో ఏకాగ్రత ముఖ్యం. సంఘంలో మంచి గుర్తింపు లభిస్తుంది. రావలసిన మొండి బాకీలు అనుకోకుండా వసూలవుతాయి. 
 
మీనం : వృత్తిరీత్యా కొత్త ప్రదేశాలకు ప్రయాణం చేస్తారు. వైద్య రంగంలోని వారికి గుర్తింపు, రాజకీయ రంగాల్లో వారికి ఆందోళన అధికం కాగలదు. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో రాణిస్తారు. ఫ్లీడర్లకు తమ క్లయింట్ల తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. మిత్రుల సహకారం వల్ల ఆర్థిక ఇబ్బంది అంటూ ఏమీ ఉండదు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బుధవారం నరసింహ స్వామి పూజ.. ఆవుపాలు, పానకాన్ని? (Video)