Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

11-05-2020 సోమవారం దినఫలాలు - శివుడిని బిల్వ పత్రాలతో పూజిస్తే..

Advertiesment
11-05-2020 సోమవారం దినఫలాలు - శివుడిని బిల్వ పత్రాలతో పూజిస్తే..
, సోమవారం, 11 మే 2020 (05:00 IST)
మేషం : గృహ మరమ్మతులు, మార్పులు, చేర్పులు వాయిదాపడతాయి. మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. మీరెంతో ప్రేమించే వ్యక్తికి, మీకు చిన్నచిన్న అపార్థాలు తలెత్తుతాయి. దైవ, సేవా కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. స్త్రీలు, షాపింగ్‌లకు ధనం అధికంగా ఖర్చు చేస్తారు. 
 
వృషభం : ఉపాధ్యాయులకు మంచి మంచి అవకాశాలు లభిస్తాయి. రావలసిన ధనం వాయిదాపడుతుంది. కొబ్బరి, పండ్లు, పూలు, చల్లని పానీయ వ్యాపారులకు లాభదాకయంగా ఉంటుంది. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి యాజమాన్యం తీరు నిరుత్సాహం కలిగిస్తుంది. వాహనం నడుపునపుడు మెళకువ అవసరం.
 
మిథునం : ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆకస్మికంగా మీలో వేదాంత ధోరణి కనపడుతుంది. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాల్లో అప్రమత్తత అవసరం. ఆత్మవిశ్వాసం రెట్టింపు అవతుంది. పాత అలవాట్లకు స్వస్తి చెప్పి, కొత్తవాటిని అలవర్చుకోండి. విద్యుత్, ఎలక్ట్రానికల్, ఇన్వెర్టర్ వ్యాపారస్తులకు పురోభివృద్ధి. 
 
కర్కాటకం : కొత్త ప్రదేశ సందర్శనలు, దైవదర్శనాలు ఉత్సాహాన్నిస్తాయి. దంపతుల మధ్య ఏకాగ్రత లోపం అధికమవుతుంది. సాహస యత్నాలు విరమించండి. రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి ఎదురుచూస్తున్న అవకాశాలు దగ్గరకు వస్తాయి. పనులకు ఆటంకాలు కల్పించాలనుకున్నవారు సైతం అనుకూలంగా మారుతారు. 
 
సింహం : ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు ఎదుర్కొంటారు. ప్రముఖులను కలుసుకుంటారు. మీ అంచనాలకు తగినట్టుగా ఆర్థిక పరిస్థితి ఉంటుంది. మీ శ్రీవారు, శ్రీమతి గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగించే పరిణామాలు ఎదుర్కొంటారు. శత్రువులు మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. 
 
కన్య : మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఉమ్మడి వ్యాపారాలు, జాయింట్ వెంచర్లు ప్రగతి పథంలో కొనసాగుతాయి. కాంట్రాక్టర్లకు ఇంజనీరింగ్ విభాగం వారితో సమస్యలు తలెత్తుతాయి. సోదరీ, సోదరుల మధ్య ఏకీభావం కుదరదు. 
 
తుల : ఆర్థిక స్థితి కొంతమేరకు మెరుగుపడుతుంది. సొంతంగా వ్యాపారం, సంస్థలు నెలకొల్పాలనే మీ ఆలోచన బలపడుతుంది. స్త్రీల ఆరోగ్యంలో సమస్యలు తలెత్తుతాయి. మీ మౌనం వారికి గుణపాఠం అవుతుంది. గృహోపకరణాలకు సంబంధించి వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధువుల రాకవల్ల ఊహించని సమస్యలు ఎదురవుతాయి. 
 
వృశ్చికం : సినిమా, సాంస్కృతిక రంగాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కలప, ఇటుక వ్యాపారస్తులకు అనుకూలత, అభివృద్ధి కానవస్తుంది. సామూహిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగస్తులు సభలు, సమావేశాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. ప్రతి పని చేతిదాకా వచ్చి వెనక్కి పోవుటవల్ల ఆందోళన పెరుగుతుంది. 
 
ధనస్సు : వస్త్ర, బంగారు, వెండి రంగాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారాభివృద్ధికై చేయు ప్రయత్నాలు ఫలించగలవు. క్లిష్ట సమయంలో బంధు మిత్రులు జారుకుంటారు. ఏమాత్రం పొదుపు సాధ్యంకాదు. చిన్నతరహా పరిశ్రమలలో వారికి శ్రమకు తగిన ప్రతిఫలం కానరాగలదు. దైవ దర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. 
 
మకరం : బ్యాంకింగ్ రంగాలలో వారికి మెళకువ అవసరం. ఖర్చులు పెరగడంతో అదనపు ఆదాయం మార్గాలపై దృష్టిసారిస్తారు. ఉద్యోగస్తులు అధికారులతో సంభాషించేటపుడు మెళకువ వహించండి. విద్యార్థులకు సంతృప్తి అభివృద్ధి కానవస్తుంది. స్త్రీలకు తల, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. 
 
కుంభం : ఆహార, వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. స్త్రీలకు పనివారలతో చికాకులు తప్పవు. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి ఒత్తిడి, పనిభారం అధికంగా ఉంటాయి. కిరాణా, ఫ్యాన్సీ, సుగంధ ద్రవ్య వ్యాపారస్తులకు సంతృప్తి కానవస్తుంది. ప్రముఖుల కలయిక వాయిదాపడుతుంది. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. 
 
మీనం : ఆహార వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. ఊహించని ఖర్చులు అధికం. ప్రింటింగ్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. విద్యా సంస్థలలోని వారికి అనుకూలమైన కాలం. ఉన్నతస్థాయి అధికారులకు కిందిస్థాయి సిబ్బందితో సమన్వయం లోపిస్తుంది. వాయిదా చెల్లింపులకు సంబంధించిన ఒత్తిడి ఎదుర్కొంటారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

10-05-2020 ఆదివారం మీ రాశి ఫలితాలు