Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీను వైట్లతో మంచు విష్ణు తదుపరి సినిమా

Webdunia
బుధవారం, 3 ఏప్రియల్ 2019 (17:34 IST)
గత కొంతకాలంగా మంచు విష్ణుకి సరైన హిట్ లేదు. దాంతో సక్సెస్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తనకి ఎంతగానో అచ్చొచ్చిన యాక్షన్ కామెడీని నమ్ముకున్నారు. అదికూడా ఆయనకి కలిసి రాకపోవడంతో మంచికథ వేచి చూస్తున్నారు. ఈ క్రమంలో దర్శకుడు శ్రీను వైట్ల చెప్పిన కథ నచ్చడంతో ఆయన ఓకే చెప్పారు. దీంతో ఈ చిత్రంతో త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్నట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు తన తదుపరి సినిమా శ్రీను వైట్లతో ఉండనుందనే విషయాన్ని విష్ణు స్వయంగా వెల్లడించారు. 
 
ఇటీవల తిరుమలలో శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఆయన, తదనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించాడు. 12 ఏళ్ల తర్వాత తాను శ్రీను వైట్లతో సినిమా చేయనున్నానని తెలిపాడు. 12 ఏళ్ల క్రితం ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'ఢీ' .. భారీ విజయాన్ని అందుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే కొంతకాలంగా శ్రీను వైట్ల కూడా సక్సెస్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మరి ఈ ఇద్దరూ కలిసి రానున్న సినిమాతో మళ్లీ హిట్ బాట పడతారేమో చూడాలి మరి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఘనంగా ఘట్కేసర్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ 6 వార్షికోత్సవం: ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

Konda Pochamma Sagar Reservoir: సెల్ఫీ పిచ్చి.. ఐదుగురు యువకులు మృతి (video)

Pawan Kalyan: రూ.10 లక్షల విలువైన పుస్తకాలకు ఆర్డర్ చేసిన పవన్ కల్యాణ్

ప్రియురాలితో సహజీవనం, పెళ్లి మాటెత్తేసరికి చంపి ఫ్రిడ్జిలో పెట్టేసాడు

Roja: వారిపై కేసులు ఎందుకు నమోదు చేయలేదు? ఆర్కే రోజా ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

తర్వాతి కథనం
Show comments