Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయ్ సేతుపతి మా హిజ్రాల పరువు తీసాడు... వెంటనే అరెస్ట్ చేయండి

Webdunia
బుధవారం, 3 ఏప్రియల్ 2019 (16:45 IST)
వరుస విజయాలతో తమిళ ఇండస్ట్రీలో దూసుకుపోతున్న స్టార్ హీరో విజయ్‌ సేతుపతిని అరెస్టు చేయాలని పలు హిజ్రా సంఘాలు డిమాండ్‌ చేశాయి. ఇటీవల విజయ్ సేతుపతి, సమంత, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన 'సూపర్ డీలక్స్' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తోంది. అంతేకాకుండా అభినయం చక్కగా ఉందంటూ విమర్శకులు, ప్రముఖులు నటీనటులపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. 
 
ఈ సినిమాలో విజయ్ సేతుపతి హిజ్రా పాత్రలో నటించాడు. హిజ్రా పాత్రలో డబ్బుల కోసం పిల్లల్ని అపహరించి, మరొకరికి అమ్మేసే సన్నివేశం ఉంది. ఈ సన్నివేశం పట్ల పలు హిజ్రా సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. సినిమాలో విజయ్ పిల్లలని కిడ్నాప్ చేశారని, హిజ్రాలు ఎప్పుడైనా అలాంటి పనులు చేసారా అని ప్రశ్నించారు. విజయ్‌ సేతుపతిని అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సినిమాతో విజయ్ సేతుపతిపై తమకు ఉండే అభిమానం పోయిందని వారు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వృద్ధుడికి ఆశ చూపిన మహిళ.. రూ. 8.7 కోట్లు కొట్టేశారు.. చివరికి ఏం జరిగిందంటే?

Bengal: పట్టపగలే హత్య.. తృణమూల్ కాంగ్రెస్ నాయకుడి కుమారుడిని కాల్చి చంపేశారు

తిరుమలలో ఆసక్తికర దృశ్యం.. అనుకోకుండా ఎదురుపడిన రోజా, నారాయణ (వీడియో)

వేడి వేడి మిర్చి బజ్జీ ప్రాణం తీసేసింది

Jagan: జగన్ రాఖీ శుభాకాంక్షలు.. ట్రోల్స్ మొదలు- దోచుకున్న దాన్ని దాచడానికి పోరాటం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments