వెండితెరపై శ్రుతిహాసన్‌ రీఎంట్రీ.. విజయ్ సేతుపతికి జోడీగా?

మంగళవారం, 2 ఏప్రియల్ 2019 (18:42 IST)
గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్న శ్రుతిహాసన్‌ మళ్లీ వెండితెరపై కనిపించాలని ఆరాటపడుతోంది. విశ్వనటుడు కమల్‌హాసన్‌‌కి వారసురాలిగా ప్రారంభమైన ఆవిడ కెరీర్‌ మొదట్లో కాస్త జోరు మీద కనిపించినప్పటికీ... వరుస పరాజయాలు ఆవిడని నిరాశ పరిచాయి.


అదే సమయంలో పెళ్లి వార్తలు కూడా ఆమె కెరీర్‌కు ఆటంకంగా మారడంతో... దాదాపు రెండేళ్లుగా శ్రుతి సినిమాలకు దూరంగానే ఉంటూ వచ్చింది. బ్రేక్ తర్వాత తనకెంతో ఇష్టమైన సంగీత రంగంలోనే ముందుకు సాగాలని భావించినప్పటికీ, ఆమె మనసు మళ్లీ సినిమాలపైకే మళ్లినట్టు తెలుస్తోంది.
 
ఈ మేరకు సీనియర్‌ దర్శకుడు ఎస్పీ జననాథన్‌ దర్శకత్వంలో విజయ్ సేతుపతి హీరోగా నటించనున్న కొత్త చిత్రంలో శ్రుతిహాసన్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.

జననాథన్‌ సినిమాలలో హీరోయిన్ల పాత్రలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఇప్పటివరకు చాలా వరకు గ్లామరస్‌ పాత్రలలోనే నటించిన శ్రుతి తన ఇమేజ్‌‌ని మార్చుకునే నిర్ణయంతోనే కథలను ఎంచుకోవాలనుకుంటున్నట్లు సమాచారం. మరి... ఇది ఏ మేరకు విజయం సాధించి పెడ్తుందో అదీ చూద్దాం...

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ‘దబాంగ్‌3’ అలా మొదలైంది