Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

‘దబాంగ్‌3’ అలా మొదలైంది

Advertiesment
dabang 3
‘దబాంగ్‌’... బాలీవుడ్‌లో ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిన విషయమే. కాగా... ఈ సినిమాకు రెండో సీక్వెల్‌ అంటే ‘దబాంగ్‌ 3’ మొదలైనట్లు సమాచారం. ఈ మేరకు ఈ చిత్రం షూటింగ్‌ను ఇండోర్‌కి సమీపంలో సోమవారంనాడు మొదలుపెట్టారట.
 
ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సల్మాన్‌ ఖాన్‌, సోనాక్షి సిన్హా జంటగా నటిస్తున్నారు. అర్బాజ్‌ ఖాన్‌ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ‘దబాంగ్‌ 3’ గురించి సల్మాన్‌ ఖాన్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ... ‘‘నేను, అర్బాజ్‌... మా సొంత ప్రాంతానికి చేరుకున్నాము. మేమిద్దరం ఇండోర్‌లోనే పుట్టాం.

ఇక్కడికి సమీపంలోని మండలేశ్వర్‌, మహేశ్వర్‌లో ‘దబాంగ్‌ 3’ షూటింగ్‌ జరుగుతుంది. మా తాత పోలీస్‌ ఫోర్స్‌లో ఉన్నప్పుడు ఈ ప్రాంతాల్లోనే పని చేసారు. సోమవారం నుండి కంటిన్యుయస్‌గా రెగ్యులర్‌ షూటింగ్‌ ఉంటుంది’’ అని తెలిపారు. కాగా... త్వరలోనే సెట్లోని అందరినీ కలవనున్నట్టు హీరోయిన్‌గా నటించనున్న సోనాక్షి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అక్కడ మనుషులు శిలలుగా మారిపోతారు... ఎక్కడ?