మనం ఎప్పుడైనా ఒక్క పామును చూస్తే భయంతో అటు ఇటూ పరుగులు తీస్తాం. అలాంటిది పదుల సంఖ్యలో పాములు ఒకేచోట ఉంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఎంత భయానకంగా ఉంటుంది కదూ..ఇలాంటి అనుభవమే అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం అల్బానీలో ఉండే ఓ ఇంటి యజమానికి ఎదురైంది. తన ఇంటి కింద ఓ కేబుల్ కోసం వెతికిన అతనికి పదుల సంఖ్యలో రాటిల్ స్నేక్స్ కనిపించాయి. వాటిని చూసి అతడు ఆందోళన చెందాడు. వెంటనే బిగ్ కంట్రీ స్నేక్ రిమూవల్‌కు ఫోన్ చేసాడు.
స్నేక్ రిమూవల్ టీమ్ అక్కడికి చేరుకుని, పరిశీలించగా..ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 45 రాటిల్ స్నేక్స్ అక్కడ కనిపించాయి. వాటిని ఒక్కొక్కటిగా చాలా జాగ్రత్తగా బయటకు తీసి అన్నింటినీ సమీపంలోని అడవిలో విడిచిపెట్టారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా ఆ సంస్థ ఫేస్‌బుక్‌లో షేర్ చేసింది. ఈ వీడియోకి ఇప్పటికే 11లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.
రాటిల్ స్నేక్ ఎంతో ప్రమాదకరమైన పాము జాతి. గతంలో కూడా ఇదే టెక్సాస్ రాష్ట్రంలో మరో వ్యక్తికి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. తన షెడ్‌లో ఏకంగా 30 రాటెల్ స్నేక్స్ అతనికి కనిపించాయి.