Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఐపీఎల్ 2019.. లుంగీ ఎంగిడీతో సీఎస్‌కేకు షాక్.. అయినా ధోనీ వున్నాడుగా!

Advertiesment
ఐపీఎల్ 2019.. లుంగీ ఎంగిడీతో సీఎస్‌కేకు షాక్.. అయినా ధోనీ వున్నాడుగా!
, గురువారం, 21 మార్చి 2019 (12:16 IST)
ఐపీఎల్ 2019 సీజన్ ఈ నెల 23వ తేదీ నుంది ప్రారంభం కానుంది. మే 5న గ్రూప్ దశ ఆఖరి మ్యాచ్ జరగనుంది. టోర్నీలో మొత్తం 8 జట్లు పోటీపడుతుండగా.. గ్రూప్ దశలో ప్రతి జట్టూ 14 మ్యాచ్‌లు ఆడనుంది. తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఢీకొననుంది. మార్చి 23 రాత్రి 8 గంటలకు ఇరు జట్ల మధ్య తొలి మ్యాచ్ జరుగనుంది. 
 
ఈ నేపథ్యంలో ఐపీఎల్ 12లో చెన్పై సూపర్ కింగ్స్ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. గాయం కారణంగా జట్టు పేసర్ లుంగీ ఎంగిడీ పూర్తి సీజన్‌కి దూరం అయ్యాడు. దీంతో ఐపీఎల్ ప్రారంభానికి ముందే ఫ్రాంచైజీకి దెబ్బ తగిలింది. 
 
రెండేళ్ల నిషేధం తర్వాత గత ఏడాది తిరిగి ఐపీఎల్‌లోకి వచ్చిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు టోర్నమెంట్‌లో అద్భుత ప్రదర్శన చేసి ఛాంపియన్‌గా నిలిచింది. గత సీజన్2లో జరిగిన వేలంలో సీఎస్‌కే ఎంగిడిని దక్కించుకుంది. గత సీజన్‌లో ఏడు మ్యాచులు ఆడిన ఇతను 11 వికెట్లు తీశాడు.
 
ఇక చెన్నై సూపర్ కింగ్స్‌కు ధోనీనే అంతా. ధోని కెప్టెన్‌గా ఉండటమే చెన్నైకి ముందుగా వేయి ఏనుగుల బలం. ఎలాంటి జట్టుతోనైనా విజయాలు సాధించగల నైపుణ్యం, ఎలాంటి స్థితి నుంచైనా జట్టును రక్షించగల సామర్థ్యం ధోనీకి వుంది. జట్టులోని ఆటగాళ్లంతా మ్యాచ్‌ను గెలిపించే సత్తా వున్నవాళ్లే. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో రాణించే క్రికెటర్లు చెన్నై జట్టుకు సొంతం. 
 
కాగా 2009, 2010లలో చాంపియన్‌గా నిలిచిన చెన్నై 2018లో మరోసారి టైటిల్‌ సాధించింది. నాలుగు సార్లు (2008, 2012, 2013, 2015) రన్నరప్‌గా నిలిచింది. గత ఏడాది పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచిన టీమ్‌ ఫైనల్లో సన్‌రైజర్స్‌ను ఓడించి ట్రోఫీ గెలుచుకుంది.  
 
జట్టు వివరాలు: ధోని (కెప్టెన్‌), రాయుడు, హర్భజన్, జాదవ్, రుతురాజ్, విజయ్, జడేజా, దీపక్‌ చహర్, జగదీశన్, రైనా, ఆసిఫ్, శార్దుల్, ధ్రువ్, మోహిత్, మోను కుమార్, బిష్ణోయ్, కరణ్‌ శర్మ (భారత ఆటగాళ్లు), తాహిర్, బిల్లింగ్స్, విల్లీ, డు ప్లెసిస్, బ్రేవో, వాట్సన్, సాన్‌ట్నర్‌ (విదేశీ ఆటగాళ్లు)

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సన్ రైజర్స్ ఆటగాళ్లకు మినప గారెలు, వడలు రుచి చూపించిన యాంకర్ సుమ