Webdunia - Bharat's app for daily news and videos

Install App

హృదయం ఉప్పొంగేలా.. ఘ‌న‌కీర్తిసాంధ్ర విజితాఖిలాంధ్ర మ‌ణిదీప‌కా ఓ క‌థానాయకా... (Audio)

Webdunia
ఆదివారం, 2 డిశెంబరు 2018 (14:21 IST)
నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ఎన్టీఆర్ బయోపిక్. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. 'కథానాయకుడు', మహానాయకుడు అనే పేర్లతో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు సంక్రాంతికిరానుంది. 
 
ఇందులో భాగంగా ఇప్పటికే పలువురు నటీనటుల వివరాలు వెల్లడయ్యాయి. ఈ సినిమా నుంచి ముఖ్యమైన కొన్ని పాత్రలకి సంబంధించిన ఫస్ట్‌లుక్స్ వచ్చి అంచనాలు పెంచాయి. తాజాగా కథానాయకుడు మూవీకి సంబంధించి తొలి పాటను రిలీజ్ చేశారు. ఎన్టీఆర్ కెరీర్ గురించి.. ఆయ‌న వేసిన పాత్ర‌ల గురించి.. ప్రేక్ష‌కుల్లో ఆయ‌న‌కు ఉన్న ఇమేజ్ వ‌ర్ణిస్తూ కీర‌వాణి తండ్రి, రచయిత శివ‌శ‌క్తిద‌త్తా, మరో రచయిత రామకృష్ణలు పూర్తి సంస్కృత పదాలతో రాసిన ఈ పాట అందరి ప్రశంసలు అందుకుంటోంది. ఎన్టీఆర్ గొప్ప‌తనాన్ని వ‌ర్ణిస్తూ ఆయన గౌర‌వాన్ని పెంచేలా ఈ పాట ఉందని ఫ్యాన్స్ అంటున్నారు.
 
ముఖ్యంగా, కీరవాణి సంగీత బాణీలకు కైలాష్ ఖేర్ స్వరం సరిగ్గా అచ్చుగుద్దినట్టు సరిపోయిందని అంటున్నారు. 'ఘ‌న‌కీర్తిసాంధ్ర విజితాఖిలాంధ్ర జ‌న‌తాసుధీంధ్ర మ‌ణిదీప‌కా ఓ క‌థానాయకా' అంటూ మొద‌లైన ఈ పాట మ‌ధ్య‌లో మ‌రిన్ని అద్భుతమైన ప‌దాల‌ను కూర్చారు శివ‌శ‌క్తిద‌త్త. ముఖ్యంగా 'త్రిశ‌కాధికా చిత్ర‌మాలికా ఓ క‌థానాయ‌కా.. ఆహార్యాధ్భుత వాచికా జైత్ర‌యాత్రికా' అంటూ ఎన్టీఆర్ చేసిన ప్ర‌తీపాత్ర‌ను త‌న పాట‌లో చూపించారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

11 గంటలు ఆలస్యంగా భోపాల్ - నిజాముద్దీన్ వందే భారత్ రైలు

యూజీ నీట్ ప్రవేశ పరీక్షా విధానంలో కీలక మార్పు?

మహా పీఠముడి... మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు?

డోనాల్డ్ ట్రంప్‌కు భారీ ఊరట.. ఏంటది..?

అరెస్టుకు సిద్ధంగా పోలీసులు.. పారిపోయిన రాంగోపాల్ వర్మ!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments