Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమర్ అక్బర్ ఆంటోని నుంచి హే హలో హలో డాన్ బాస్కో పాట రిలీజ్ (video)

Advertiesment
అమర్ అక్బర్ ఆంటోని నుంచి హే హలో హలో డాన్ బాస్కో పాట రిలీజ్ (video)
, మంగళవారం, 6 నవంబరు 2018 (16:16 IST)
రవితేజ హీరోగా, ఇలియానా హీరోయిన్‌గా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న సినిమా 'అమర్ అక్బర్ ఆంటోని'. ఈ సినిమా నుంచి తాజాగా లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. దీపావళి కానుకగా అందించిన ఈ లిరికల్ వీడియో సాంగ్ అదరగొట్టేస్తోంది. "హే హలో హలో డాన్ బాస్కో .. ఛల్ ఛలో ఛలో పంజూస్కో .. పడిపడి ఎంతైనా ట్రై చేస్కో .. నే దొరకను కాస్కో" అంటూ ఈ పాట ఆకట్టుకుంటోంది. 
 
తమన్ అందించిన ఈ బాణీలు యూత్‌ను ఆకట్టుకునేలా వుంది. విశ్వ రాసిన ఈ పాటను శ్రీకృష్ణ, జస్ప్రీత్, రమ్య బెహ్రా తదితరులు ఆలపించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఈ నెల 10వ తేదీన గ్రాండ్‌గా జరపనున్నారు. ఈ నెల 16వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. శ్రీను వైట్ల .. రవితేజ కాంబినేషన్లో గతంలో వచ్చిన సినిమాలు భారీ విజయాలను సాధించాయి. అందువలన ఈ సినిమాపై అందరిలోనూ భారీ అంచనాలున్నాయి.
 
ఇప్పటికే ఈ టీజర్‌కు మంచి స్పందన లభించింది. టైటిల్‌కి తగినట్టుగానే మూడు డిఫరెంట్ లుక్స్‌తో రవితేజను చూపుతూ టీజర్‌ను కట్ చేశారు. విదేశాల్లోని లొకేషన్స్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నట్టు ఈ టీజర్‌ను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా శాటిలైట్ హక్కుల కోసం బంపర్ ఆఫర్ ఇచ్చి జెమిని చానెల్ దక్కించుకుందట. 
 
రవితేజ, శ్రీను వైట్ల సక్సెస్‌లో లేకపోవడం వల్ల ఈ సినిమా బిజినెస్, ఇతర రైట్స్‌కి మంచి ఆఫర్స్ రావని అందరూ భావించారు. కానీ మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మించడం, రవితేజ లుక్, టీజర్స్, ట్రైలర్ అందరినీ ఆకట్టుకునేలా చేయడంలో శ్రీను వైట్ల సక్సెస్ అవ్వడం సినిమాపై హైప్‌ని క్రియేట్ చేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎన్నికల పోటీ నుంచి తప్పుకుంటున్నా.. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ