Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

"మిస్టర్ మజ్ను"... 'దేవదాస్‌ మనవడో.. మన్మథుడికి వారసుడో'...

Advertiesment
, శుక్రవారం, 9 నవంబరు 2018 (10:02 IST)
యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున రెండో కుమారుడు అఖిల్ అక్కినేని తాజా చిత్రం "మిస్టర్ మజ్ను". వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రమముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్. 
 
ప్రస్తుతం చిత్రీకరణ తుదిదశలో ఉండగా, దీపావళి పండుగను పురస్కరించుకుని ఈ చిత్రం పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. అంతక్రితం ఫస్ట్‌లుక్‌తో విడుదల చేసిన 'దేవదాస్‌ మనవడో.. మన్మథుడికి వారసుడో, కావ్యంలో కాముడో.. అంతకన్నా రసికుడో' సాంగ్‌ ప్రోమోకు మంచి స్పందన వచ్చింది. 
 
యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని జనవరిలో సినిమాను విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో మెగా బ్రదర్ నాగబాబు, ప్రియదర్శి, జయప్రకాష్‌, హైపర్‌ ఆది కీలక పాత్రలు పోషిస్తుండగా, ఎస్ఎస్. థమన్ సంగీత బాణీలు సమకూర్చుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేనికైనా రెడీ... ఎక్స్‌పోజింగ్ కామనే కదా... : యంగ్ హీరోయిన్