Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నలుగురమ్మాయిలతో చిట్టిబాబు... చెర్రీ స్టయిల్ అదిరిపోయింది...

Advertiesment
నలుగురమ్మాయిలతో చిట్టిబాబు... చెర్రీ స్టయిల్ అదిరిపోయింది...
, శనివారం, 1 డిశెంబరు 2018 (13:45 IST)
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం "వినయ విధేయ రామ". ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే పూర్తిచేసుకుంది. దీంతో ఈ చిత్రం ప్రమోషన్స్, ఇతర కార్యక్రమాలపై దృష్టిసారించింది. ఫస్ట్ టీజర్ పక్కా మాస్‌గా వస్తే.. ఆ తర్వాత వరుసగా ఫ్యామిటీ ఎంటర్ టైన్ బేస్‌గా పోస్టర్స్ రిలీజ్ అవుతున్నాయి. 
 
నిన్నటికి నిన్న బుద్ధిమంతుడుగా చెర్రీని చూపిస్తే.. సాంగ్ రిలీజ్ పోస్టర్ మాత్రం లవ్లీగా ఉంది. 'తందానే తందానే' సాంగ్ డిసెంబర్ 3వ తేదీ సోమవారం సాయంత్రం 4 గంటలకు విడుదల చేస్తున్నట్లు ఓ పోస్టర్ ద్వారా యూనిట్ ప్రకటించింది. ఇది చాలా డిఫరెంట్‌గా ఉందనే టాక్ వచ్చింది. 
 
ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను శనివారం చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులో హీరో చెర్రీ.. నలుగురు అమ్మాయిలతో చిరునవ్వులు నవ్వుతూ ఉంటాడు. చేతిలో కొబ్బరి బోండాలు ఉంటాయి. ఏదో జోక్‌కు అందరూ పగలబడి నవ్వుతుంటారు. పార్కులోనే, ఫారెస్ట్‌లోనూ ఈ సీన్ తీసినట్లు బ్యాక్ గ్రౌండ్ చూస్తే తెలుస్తోంది. చెర్రీ స్టయిల్ అదిరిందనే చెప్పాలి. మాస్ ఒక్కటే కాదు.. ఫుల్ లవ్లీ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా మూవీ ఉంటుందని ఈ పోస్టర్ ద్వారా బోయపాటి చెప్పాలనుకున్నట్లు స్పష్టం అవుతుంది. హీరోయిన్‌గా కియారా అద్వానీ నటిస్తుండగా.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టెన్త్ క్లాస్ అబ్బాయిని పెళ్ళి చేసుకోనున్న రాఖీ సావంత్