Webdunia - Bharat's app for daily news and videos

Install App

`రంగు బొమ్మల కథ`చిత్రం ఎలా ఓకే అయిందంటే!

రాత్రి లైన్ చెప్ప‌డం తెల్లారే క‌థ ఓకే అవ్వ‌డం

Webdunia
శనివారం, 13 ఫిబ్రవరి 2021 (14:04 IST)
Prasath, Menal, Atchi reddy
ప్రశాంత్, మీనల్లను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ నూతన దర్శకుడు వి గోపి దర్శకత్వంలో  లక్కీఫేస్‌ ఎంటర్టైన్‌మెంట్‌ బ్యానర్‌ పై  నిర్మాత కమలాకర్‌ రాచకొండ నిర్మిస్తున్న `రంగు బొమ్మల కథ` చిత్రం శనివారం హైదరాబాద్‌, ఫిల్మ్‌నగర్‌ కల్చరల్‌ సెంటర్‌లో పూజా కార్యక్రమాలతో షూటింగ్‌ ప్రారంభమైంది. దైవ సన్నిధానంలోని సాయి బాబా గుడిలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు.  ఈ సందర్బంగా టైటిల్ పోస్టర్ కూడా లాంచ్ చేసారు. అనంతరం హీరో హీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ సీనియర్‌ దర్శకుడు ఎస్‌.వి. కృష్ణారెడ్డి గౌరవ దర్శకత్వం వహించగా, ప్రముఖ నిర్మాత అచ్చిరెడ్డి క్లాప్‌కొట్టారు. బిగ్‌బాస్‌ ఫేమ్‌ సొహైల్‌ కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. 
 
అనంతరం ఎస్‌. వి. కృష్ణారెడ్డి మాట్లాడుతూ ‘‘ తమ కలని నిజం చేసుకోవడానికి చిత్రబృందం కసిగా చేస్తున్న తొలి ప్రయత్నం విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నాను. టీం కు ఆల్‌ ది బెస్ట్‌’’ అని అన్నారు. నిర్మాత కె అచ్చి రెడ్డి మాట్లాడుతూ, ‘‘టైటిల్‌ చూడగానే చాలా పాజిటివ్‌ ఫీలింగ్‌ వచ్చింది. రంగులను తెరపైన చూడడానికి ప్రేక్షకులు పూర్తి నమ్మకంతో థియేటర్లకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీరు ఎంచుకున్న కథాంశం కొత్తగా ఉంది. మంచి అభిరుచితో ఈ చిత్రాన్ని వినూత్నంగా తెరకెక్కిస్తారని నమ్ముతున్నాం’ అని అన్నారు. 
 
బిగ్ బాస్ ఫేమ్ సోహైల్‌ మాట్లాడుతూ‘‘రంగుబొమ్మల కథ’ చిత్ర బృంధానికి నా శుభాకాంక్షలు. చిన్న సినిమాలకు ఓటీటీల్లో మంచి ఆదరణ దక్కుతోంది. ఇది చిన్న సినిమాయే అయినా పెద్ద సినిమా స్థాయిలో విజయం అందుకోవాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా తర్వాత మీ జీవితం రంగులమయం కావాలని కలర్‌ఫుల్‌గా ఉండాలని కోరుకుంటున్నాను. కమలాకర్‌, గోపీ ఇద్దరు కూడా మధ్య తరగతి నేపథ్యం నుంచి వచ్చినవారే. వారిద్దరిలోనూ కష్టపడి పైకి రావాలనే తపన ఉంది. 11 ఏళ్లు కష్టపడ్డాక నాకు బ్రేక్‌ వచ్చింది. ఏదైనా అవకాశం వచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోవాలి.  ఈ సినిమాలో నటిస్తోన్న హీరో, హీరోయిన్లుకు దర్శకుడికి మంచి పేరుతో పాటు నిర్మాతగా కమలాకర్‌ విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. 
 
దర్శకుడు గోపాల కృష్ణ మాట్లాడుతూ .. ‘‘దర్శకుడిగా నాకు ఈ అవకాశం ఇచ్చిన మా నిర్మాత కమలాకర్‌ రాచకొండ గారికి ధన్యవాదాలు. టాలెంట్‌ను గుర్తించి ప్రోత్సహించడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. రాత్రి కథకు సంబంధించిన లైన్‌ చెప్పగానే మార్నింగ్‌ ప్రాజెక్ట్‌ను ఓకే చేశారు’’అన్నారు 
 
నిర్మాత కమలాకర్‌ రాచకొండ మాట్లాడుతూ ‘‘ఒకప్పుడు ఎస్వీ కృష్ణారెడ్డి గారి చిత్రాలను మేం ఎంజాయ్‌ చేస్తూ చూశాం. ఇప్పుడు మా తొలి చిత్రం ప్రారంభోత్సవం సందర్భంగా వారితో వేదిక పంచుకోవడం సంతోషంగా ఉంది. ఈ నెల 20 నుంచి వరంగల్‌ సమీపంలోని గంగదేవిపల్లెలో మా చిత్రం షూటింగ్‌ ప్రారంభిస్తున్నాం’’ అన్నారు. 
కథానాయిక మీనల్‌ మాట్లాడుతూ .. ‘‘ఈ సినిమాలో కథానాయికగా కొత్త  తరహా పాత్ర పోషిస్తున్నాను. గ్రామీణ యువతిగా నటనకు ఆస్కారం ఉన్న పాత్ర చేస్తున్నాను. ఒక సాధారణ మహిళ కష్టపడి జీవితంలో ఉన్నత స్థాయికి చేరడానికి పడిన కష్టాన్ని తెరపై చూపిస్తున్నాం’’ అని   అన్నారు.  

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments