Webdunia - Bharat's app for daily news and videos

Install App

`అరె గుచ్చే గులాబిలాగా` అంటూ పాడుతున్న‌ అఖిల్

Webdunia
శనివారం, 13 ఫిబ్రవరి 2021 (13:46 IST)
Akhil Akkineni and Pooja Hegde
‌`అరె గుచ్చే గులాబిలాగా నా గుండె లోతునే తాకినిదే. వెలుగిచ్చే మ‌తాబిలాగా నా రెండు క‌ళ్ళ‌లో నిండిన‌దే..ఎవ‌రే నువ్వే ఏంచేసినావే.. ఎటుగా న‌న్నే లాగేసినావే.` అంటూ విభ మీద త‌న ఫీలింగ్ ని పాట రూపంలో పాడుతున్నాడు అఖిల్ అక్కినేని.  బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్‌‌గా నటిస్తుంది. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ సినిమాపేరు. రేపు వాలెంటేన్స్ సంద‌ర్భంగా శ‌నివారంనాడు ఈ సాంగ్‌ను విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌.
 
ఈ సినిమాను జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై బన్నీ వాసు, మరో నిర్మాత ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వాసు వర్మతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో వారి అంచ‌నాలు మ‌రో రెండింత‌లు పెరిగేలా గుచ్చే గులాబి సాంగ్ వుండ‌టం విశేషం. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన ప‌బ్లిసిటి మెటెరియ‌ల్ కి అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల నుండి మంచి రెస్సాన్స్ రావ‌టం చిత్ర యూనిట్ మ‌రింత ఉత్సాహంగా వున్నారు. అనూహ్యమైన స్పందన లభించడం యూనిట్‌లో కొత్త ఉత్సాహ‌న్ని తెచ్చింది. ఈ నేప‌థ్యంలో ప్రేమికుల రోజు కానుకా సెన్సేష‌న్ మ్యూజిక్ డైరక్ట‌ర్ గోపీ సుంద‌ర్ ట్యూన్ చేసిన గుచ్చే గులాబీలాగా సాంగ్ కి అనంత్ శ్రీరామ్ లిరిక్స్ అందించారు. ఈ సాంగ్ ని అర్మ‌న్ మాలిక్ పాడారు. బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ చిత్రాల్లో ఆడియో ఎప్పుడు పెద్ద ఎసెట్ కావ‌టం, అలాగే జి ఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ లో చిత్రాల‌కి మ్యూజిక్ పెద్ద ఎసెట్ కావ‌టం విశేషం. ఇప్ప‌డు వీరిద్ద‌రి కాంబినేష‌న్ సాంగ్స్ వ‌స్తున్న ఈ సాంగ్స్ కి చిత్రం లో అంచ‌నాలు మించేలా వుండేలా జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. ఈ చిత్రాన్ని అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి  జూన్ 19న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

బీఆర్ఎస్ పార్టీ వుండదా? వైసిపిని చూడండి: విజయశాంతి భారాసలో చేరుతారా?

18వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో ఆగస్టు కోటా ఆర్జిత సేవా టిక్కెట్లు

వివేకా హత్య కేసు... కడప జిల్లా కోర్టుపై సుప్రీం ఫైర్

రాత్రి 11 గంటలకు సతీసమేతంగా లండన్‌కు వెళుతున్న సీఎం జగన్

వైకాపా నేతలు చంపేస్తారు : భద్రత కల్పించండి ... గొట్టిముక్కల సుధాకర్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments