Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక్క ఛాన్స్ అడిగితే.. ఒక్క రాత్రి గడపాలన్నాడు : డోనాల్ బిస్ట్ (video)

Webdunia
బుధవారం, 23 డిశెంబరు 2020 (14:41 IST)
ఇపుడు బాలీవుడ్‌ చిత్రపరిశ్రమలో వరుస అవకాశాలు సొంతం చేసుకుంటున్న హీరోయిన్లలో ఒకరు డోనాల్ బిస్ట్. ఈమెకు తొలుత బాలీవుడ్‌లో అవకాశాలు ఒక్కటంటే ఒక్కటీ దక్కలేదు. దీంతో దక్షిణాదిలోకి అడుగుపెట్టింది. కానీ, ఇక్కడ ఆమెకు ఎదురైన అనుభవంతో తిరిగి చెప్పాపెట్టకుండా బాలీవుడ్‌కు చెక్కేసింది. ఇపుడు వరుస ఆఫర్లతో దూసుకెళుతోంది. 
 
ఈ నేపథ్యంలో ఆమె తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ప్రారంభంలో తనను ఓ షో కోసం ఎంపిక‌ చేశారని, దీంతో డేట్స్‌ ఇచ్చానని, రెమ్యునరేషన్‌ కూడా ఫైనల్‌ అయ్యిందని చెప్పింది.
 
అయితే, ఉన్నట్టుండి ఆ ప్రాజెక్ట్‌ నుంచి తనను తీసేశారని, ఆ చానెల్ వారు‌ వేరే నటిని ఎంపిక చేశారని తెలిపింది. దీంతో పరిశ్రమ, ముంబైలోని వ్యక్తులు అంటేనే నకిలీ అనే అభిప్రాయానికి తాను, తన కుటుంబ సభ్యులు వచ్చామని చెప్పింది. అయితే, తనకు నటన మీద ఉన్న పిచ్చి తగ్గలేదని చెప్పింది.
 
దీంతో తాను ఆడిషన్లకు వెళ్తూనే ఉన్నానని చెప్పింది. ఇలా సినిమాల్లో ఒక్క ఛాన్స్ కోసం ప్రయత్నిస్తుండగా దక్షిణాదిలో ఇంతకంటే భయంకరమైన అనుభవం ఎదురయ్యిందని ఆమె తెలిపింది. ఓ దర్శకుడు తనకు‌ అవకాశం ఇస్తానని చెప్పాడని, అయితే, తనతో గడపాలని అన్నాడని వెల్లడించింది. దీంతో తాను వెంటనే ఆ దర్శకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పింది. 
 
ఆ వెంటనే తాను దక్షిణాదిని విడిచిపెట్టి తిరిగి ముంబైకి వచ్చానని తెలిపింది. తన ప్రతిభను గుర్తించిన దర్శకులు అవకాశాలు ఇచ్చారని చెప్పుకొచ్చింది. తాను తన కష్టాన్నే నమ్ముకున్నానని, సినీ పరిశ్రమలోకి రావడానికి బాగా శ్రమించానని తెలిపింది. చివరకు సరైన మార్గంలోనే సినీ పరిశ్రమంలోకి వచ్చానని చెప్పుకొచ్చింది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమెరికాలో నారా లోకేష్.. తెలంగాణ నెటిజన్ల బాధేంటంటే?

ఏపీలో రూ.1,40,000 కోట్లు పెట్టుబడి.. అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్

సొంత రాష్ట్రం.. ఆర్మీ జవాన్లతో ప్రధాని మోదీ దీపావళి సెలెబ్రేషన్స్ (video)

కేరళలో వందే భారత్ సరికొత్త ట్రాక్‌ల కోసం ఏర్పాట్లు

ఆ మీడియా సంస్థలను నడిరోడ్డు మీద నిలబెడతా: పోలీసు వాహనం నుంచి బోరుగడ్డ వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

15 నిమిషాల నడక వల్ల 7 ప్రయోజనాలు, ఏంటవి?

గుమ్మడి విత్తనాలు ఎందుకు తినాలో తెలుసుకోవాల్సిన విషయాలు

కమలా పండ్లు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తీపిపదార్థాలను తినడాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు, ఎలాగంటే?

ఎముక పుష్టి కోసం ఇవి తినాలి, ఇలా చేయాలి

తర్వాతి కథనం
Show comments