Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తప్పుడు కథనాలు ప్రసారం చేసిన వారికి చుక్కలు చూపిస్తాం : రియా అడ్వకేట్

తప్పుడు కథనాలు ప్రసారం చేసిన వారికి చుక్కలు చూపిస్తాం : రియా అడ్వకేట్
, సోమవారం, 12 అక్టోబరు 2020 (10:39 IST)
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు, బాలీవుడ్ డ్రగ్స్ కేసులో నిందితురాలైన నటి బాలీవుడ్ రియా చక్రవర్తి తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తనకు వ్యతిరేకంగా తప్పుడు కథనాలు, వార్తలు ప్రసారం చేసిన వారిపై రీవెంజ్ తీర్చుకునేందుకు ఆమె సిద్ధమవుతున్నారు. ఇదేవిషయాన్ని ఆమె తరపు న్యాయవాది సతీశ్ మానేషిండే వెల్లడించారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణించడానికి ఒక్క రోజు ముందు అతన్ని రియా చక్రవర్తి కలిసిందని సంచలన ఆరోపణలు చేసిన పొరుగింటి యువతి, సీబీఐ విచారణలో తన ఆరోపణలపై ఆధారాలను అందించడంలో విఫలమైంది. దీంతో తప్పుడు సమాచారాన్ని వ్యాపించేలా మాట్లాడవద్దని ఆమెను హెచ్చరించారు. 
 
సుశాంత్ మరణం తర్వాత, మీడియా ముందుకు వచ్చిన రియా చక్రవర్తి పొరుగింటి యువతి.. అనేక ఆరోణలు చేసింది. కానీ, సీబీఐ ఎదుట సరైన ఆధారాలు ప్రవేశపెట్టలేకపోయింది. ఆమె ఒక్కరే కాదు. ఇలా అనేక మంది ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. తప్పుడు ఆరోపణలు చేసిన వారందరి జాబితాను తయారు చేస్తున్నాం. వారందరిపైనా చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్టు స్పష్టం చేశారు.
 
"టీవీ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో మొబైల్ రికార్డింగ్స్, సుశాంత్, తన క్లయింట్‌పై తప్పుడు కథనాలు ప్రసారం చేసిన, తప్పుడు ఆరోపణలు చేసిన అందరి జాబితానూ సీబీఐకి అందించనున్నాం. వీరందరూ విచారణను తప్పుదారి పట్టించి, మా క్లయింట్‌ను తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. అందరినీ విచారించి చర్యలు తీసుకోవాలని సీబీఐని కోరనున్నాం" అని తెలిపారు.
 
అయితే, జూన్ 13న రియా వద్దకు సుశాంత్ వచ్చాడని, రియా పొరుగునే ఉండే యువతి క్లయిమ్ చేయగా, ఆమె వ్యాఖ్యలు పలు టీవీ చానెళ్లలో ప్రసారమయ్యాయి. ఆపై సీబీఐ విచారణలో తాను జూన్ 13న సుశాంత్‌ను చూడలేదని స్పష్టం చేయడంతో, ఆమెపై అధికారులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
 
ఈ కేసు ట్రయల్స్‌లో మీడియా పాత్రను సైతం కోర్టు నిశితంగా గమనిస్తోందని చెప్పిన రియా న్యాయవాది సతీశ్, సుశాంత్‌కు రియానే డ్రగ్స్ అందించిందని అతని కుటుంబీకులు చేసిన ఆరోపణలపైనా, సీబీఐ విచారించాలని కోరనున్నామని అన్నారు. ఈ కేసులో నార్కోటిక్స్ బ్యూరో అధికారులు రియాను అరెస్ట్ చేయగా, దాదాపు నెల రోజుల తరువాత ఆమె బెయిల్ పై బయటకు వచ్చిన సంగతితెలిసిందే.
 
కాగా, జూన్ 14వ తేదీన సుశాంత్, ముంబైలోని తన అపార్టుమెంట్‌లో ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. సుశాంత్ మృతికి ఆత్మహత్యే కారణమని, మరే ఇతర అనుమానిత ఆధారాలు లభించలేదని ఢిల్లీ ఎయిమ్స్ సైతం తేల్చి చెప్పింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మాస్క్ వాడిన మాజీ ముఖ్యమంత్రి జయలలిత?! ఎప్పుడు, ఎక్కడ?