Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రియాను వేధించొద్దు ... వాహనాలను వెంబడించడం నేరం : మీడియాకు ఖాకీల వార్నింగ్

రియాను వేధించొద్దు ... వాహనాలను వెంబడించడం నేరం : మీడియాకు ఖాకీల వార్నింగ్
, బుధవారం, 7 అక్టోబరు 2020 (15:29 IST)
బాలీవుడ్ డ్రగ్స్ కేసులో అరెస్టు అయి దాదాపు నెల రోజుల పాటు జైలు జీవితం గడిన బాలీవుడ్ నటి రియా చక్రవర్తికి మాదకద్రవ్యాల కేసులో బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆమె ఏ క్షణమైనా జైలు నుంచి విడుదలకావొచ్చు. అయితే, ఈ కేసులో రియా నుంచి ఇంటర్వ్యూ తీసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసిన జాతీయ మీడియా మరోసారి ఆమె వెంటపడే అవకాశం ఉండడంతో మీడియాకు ముంబై పోలీసులు గట్టి హెచ్చరికలే చేశారు. 
 
ఏ క్షణమైనా జైలు విడుదలయ్యే రియా చక్రవర్తిని వేధించవద్దు.. వెంబడించవద్దు అంటూ కోరారు. పైగా, వాహనాలను వెంబడించడం నేరమని పోలీసులు అంటున్నారు. ఆమెపై సంబంధం లేని ప్రశ్నలు అడగవద్దని చెప్పారు. సెలబ్రిటీలను, వారి న్యాయవాదులను జర్నలిస్టులు ఇంటర్వ్యూలు చేయాలనే ఉద్దేశంతో వారి వాహనాలను వెంబడించొద్దని సూచించారు. ఇలా వాహనాలను వెంబడించడం నేరమని పోలీసులు స్పష్టం చేశారు.
 
పైగా, వాహనాలను వెంబడించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. వాహనాలను వెంబడిస్తే జర్నలిస్టుల జీవితాలతోపాటు, రోడ్ల మీద నడుస్తున్న సాధారణ ప్రజలకు ప్రమాదమని చెప్పారు. సెలబ్రిటీల వాహనాలను ఇతర వాహనాల్లో వెంబడించే డ్రైవర్‌తో పాటు వారిని ప్రేరేపించిన వారిపై కూడా చర్యలు తీసుకుంటామని ముంబై మహానగర పోలీసులు హెచ్చరించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దెబ్బకు మాట మార్చేసిన శృతిహాసన్, అసలు ఏమైంది..?