ఈ నెల 19వ తేదీ నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ అంచె పోటీలు ప్రారంభంకానున్నాయి. ఈ పోటీల కోసం ఇప్పటికే ఎనిమిది జట్లకు చెందిన ఆటగాళ్లు టోర్నీకి ఆతిథ్యమిచ్చే యూఏఈకి చేరుకున్నాయి. ప్రస్తుతం ఆటగాళ్లంతా ముమ్మర సాధనలో మునిగితేలుతున్నారు. ఈ టోర్నీలో పలువురు యువ ఆటగాళ్లు కూడా ఉన్నారు. అలాంటి యువ ఆటగాళ్లో పృథ్వీ షా ఒకరు. భారత జాతీయ జట్టుకు కూడా ప్రాతినిథ్యం వహించాడు.
అయితే, ఈ 20 యేళ్ళ యువ క్రికెటర్ ప్రస్తుతం ఐపీఎల్2020లో ఢిల్లీ క్యాపిటల్ జట్టు తరపున ఆడనున్నాడు. అయితే, ఈ కుర్రోడు టీవీ, ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన యువ నటితో డేటింగ్‌లో మునిగితేలుతున్నాడట.
కలర్స్ టీవీలో ప్రసారమయ్యే 'ఉడాన్' సిరీయల్‌లో నటి ప్రాచి సింగ్ నటించింది. సోషల్‌మీడియాలో వీరిద్దరూ సన్నిహితంగా ఉండటంతో వీరి డేటింగ్ రిలేషన్ గురించి నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఒకరి పోస్ట్‌కు మరొకరు తప్పకుండా కామెంట్ లేదా ఎమోజీతో రీప్లే ఇస్తున్నారు.