Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాపం వినాయక్, చిరు షాక్ ఇచ్చారా?

Webdunia
శనివారం, 10 అక్టోబరు 2020 (13:41 IST)
ఆది సినిమాతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చిన వినాయక్.. అనతి కాలంలోనే స్టార్ హీరోలను డైరెక్ట్ చేసి స్టార్ డైరెక్టర్ అయ్యారు. అయితే.. మెగాస్టార్ చిరంజీవితో ఖైదీ నెంబర్ 150 సినిమాని డైరెక్ట్ చేసి సంచలన విజయం సాధించారు. ఆ తర్వాత కెరీర్లో గ్యాప్ వచ్చింది. దీంతో డైరెక్షన్ పక్కన పెట్టి యాక్టర్‌గా ఎంట్రీ ఇవ్వాలి అనుకున్నారు.
 
శీనయ్య అనే సినిమాలో మెయిన్ లీడ్‌గా నటించడానికి ఒప్పుకోవడం.. షూటింగ్ స్టార్ట్ చేయడం జరిగింది కానీ.. కొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్ట్ ఆగింది. ఇదిలా ఉంటే.. వినాయక్ చిరుతో లూసీఫర్ రీమేక్ చేయనున్నారు. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కథలో మార్పులుచేర్పులు చేసారు. చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
 
అయితే... ఆచార్య తర్వాత చిరంజీవి వినాయక్‌తో లూసీఫర్ రీమేక్ స్టార్ట్ చేస్తారో..? మెహర్ రమేష్‌తో వేదాళం రీమేక్ చేస్తారా..? అనేది ఇంకా ఫైనల్ కాలేదు. ఆచార్య షూటింగ్‌ని వచ్చే నెలలో స్టార్ట్ చేయనున్నారు. ఈ సినిమా కంప్లీట్ అయిన తర్వాతే నెక్ట్స్ ఏ సినిమా చేయాలి అనేది ఫైనల్ చేస్తారని సమాచారం.
 
అయితే.. వినాయక్ పుట్టినరోజు సందర్భంగా చిరు తనతో చేయనున్న మూవీని ఎనౌన్స్ చేస్తారని వినాయక్ ఆశించారట. ఆచార్య తర్వాత ఎవరితో సినిమా చేయాలో ఇంకా కన్ఫర్మ్ కాలేదు కనుక ఇప్పుడు ప్రకటించలేదు. వినాయక్ మాత్రం తన పుట్టినరోజు కానుకగా ఎనౌన్స్ చేస్తారనుకున్నారట. అలా... జరగకపోవడంతో ఫీలయ్యాడని టాక్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తిరుపతి ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్.. ఎస్పీపై బదిలీవేటు

అవేవీ అవసరం లేకపోయినా కొంటూ, ఆర్భాటాలకు పోయి ఆర్థికంగా కుంగిపోతున్న ప్రజలు

తప్పు జరిగింది.. క్షమించండి.. పోలీసులు - ఫ్యాన్స్‌పై ఆగ్రహం : పవన్ కళ్యాణ్ (Video)

భార్యపై స్నేహితులతో అత్యాచారం చేయిస్తూ ఆనందిస్తున్న సౌదీ భర్త, పోలీసులు దర్యాప్తు

తిరుపతి కలెక్టర్ - ఎస్పీకి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన సీఎం చంద్రబాబు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments