Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చిరంజీవి, బాలయ్య, నాగార్జున కోసం కథలు రెడీ చేసిన పూరీ?

Advertiesment
Puri
, బుధవారం, 7 అక్టోబరు 2020 (13:32 IST)
టాలీవుడ్లో స్పీడుగా సినిమాలు తీసే డైరెక్టర్ అంటే ఠక్కున చెప్పే పేరు పూరి జగన్నాథ్. ఈ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ ప్రస్తుతం సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండతో ఫైటర్ మూవీ చేస్తున్నారు. విజయ్ - అనన్య పాండే జంటగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా ఆగింది. ఇప్పుడు స్టార్ హీరోలు, యువ హీరోలు షూటింగ్ స్టార్ట్ చేసారు కానీ.. స్పీడుగా సినిమాలు చేసే పూరి మాత్రం ఇంకా షూటింగ్ స్టార్ట్ చేయలేదు.
 
అదేంటి.. ఏమాత్రం ఖాళీ లేకుండా వర్క్ చేసే పూరి ఇంత సైలెంట్‌గా ఉన్నారేంటి అనుకుంటున్నారా. పూరి నవంబర్ లేదా డిసెంబర్ నుంచి స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. ఫైటర్ మూవీ పాన్ ఇండియా మూవీ. ఈ చిత్రాన్ని కరణ్‌ జోహార్ హిందీలో ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఆయన ప్రస్తుతం డ్రగ్స్ కేసుకు సంబంధించి విచారణకు హాజరయ్యారు. అందుచేత కాస్త డిస్ట్రబ్‌గా ఉన్నారట. అందుచేత ఫైటర్ షూటింగ్ స్టార్ట్ చేయడం ఆలస్యం అవుతుందని టాక్.
 
అయితే.. పూరి 2020 ఎలాగూ పోయింది కనుక 2021 నుంచి ఓ పది సంవత్సాలకు సరిపడ కథలు రెడీ చేసాడట. ఇక ఇప్పుడు షూటింగ్ స్టార్ట్ చేసి వీలైనంత త్వరగా ఫైటర్ కంప్లీట్ చేయాలనుకుంటున్నాడు. ఆ తర్వాత నుంచి ఇక సినిమాలే సినిమాలు అన్నట్టుగా ఖాళీ లేకుండా వరుసగా సినిమాలు చేయడానికి పక్కా ప్లాన్ రెడీ చేసాడని తెలిసింది.
 
చిరంజీవి కోసం ఓ కథ, బాలయ్య కోసం ఓ కథ, నాగార్జున కోసం ఓ కథ రెడీ చేసారు. అలాగే హిందీలో సినిమా చేసేందుకు ఓ స్టోరీ.. ఇలా చాలా కథలు రెడీ చేసాడట. ఫైటర్ తర్వాత ఎవరితో సినిమా చేస్తారనేది ప్రస్తుతానికి సస్పెన్స్. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తేజు కోసం దేవకట్టా బాగానే సెట్ చేసాడుగా..?