Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అర్జున్ మేనల్లుడు చిరంజీవి సర్జా భార్య మేఘన సీమంతం, పక్కనే కటౌట్‌తో.. (video)

Advertiesment
అర్జున్ మేనల్లుడు చిరంజీవి సర్జా భార్య మేఘన సీమంతం, పక్కనే కటౌట్‌తో.. (video)
, మంగళవారం, 6 అక్టోబరు 2020 (13:25 IST)
ప్రముఖ కన్నడ హీరో చిరంజీవి సర్జా ఈ ఏడాది ఆకస్మికంగా మృతి చెందిన సంగతి తెలిసిందే. శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ కన్నుమూశారు. 
 
ఆయన మరణం కన్నడ చిత్ర పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. చిరంజీవి సర్జాకు భార్య ఉండగా, అతను చనిపోయే నాటికి మేఘనా రాజ్ గర్భవతి. తాజాగా మేఘనా సీమంతం వేడుకలను కుటుంబ సభ్యులు ఘనంగా జరిపించారు. వేడుకలో మేఘనా రాజ్ కూర్చున్న కుర్చీ పక్కన దివంగత నటుడు సర్జా చిరంజీవి కటౌట్‌ని ఉంచి ఆయన లేని లోటును తీర్చారు.
 
వేడుకకు కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే హాజరు కాగా, వారు మేఘనాని ఆశీర్వదించారు. ప్రస్తుతం మేఘనా రాజ్ సీమంతం వేడుకల ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
వాటిని చూసిన చిరంజీవి సర్జా అభిమానులు భావోద్వేగానికి లోనవుతున్నారు. కథానాయిక మేఘనారాజ్‌తో పదేళ్లు ప్రేమాయణం సాగించిన చిరంజీవి సర్జా 2018లో మేఘనా రాజ్‌ను వివాహం చేసుకున్నారు. 
webdunia
కన్నడంలో 19 సినిమాల్లో హీరోగా నటించిన చిరంజీవి సర్జా సీనియర్‌ హీరో అర్జున్‌కు మేనల్లుడు అర్జున్‌ దగ్గర నాలుగు సంవత్సరాలు సహాయదర్శకుడిగా పనిచేసిన చిరంజీవి 'వాయుపుత్ర' సినిమాతో హీరోగా అరంగేట్రం చేశారు. తొలి సినిమాతోనే మంచి నటుడిగా పేరుతెచ్చుకున్నారు. 
 
చంద్రలేఖ, విజిల్‌, రుద్రతాండవ, రామ్‌లీలా, అమ్మ ఐ లవ్‌ యూతో పాటు పలు చిత్రాలు హీరోగా ఆయనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. చిరంజీవి సర్జా హీరోగా నటించిన చివరి చిత్రం 'శివార్జున' మార్చిలో ప్రేక్షకుల ముందుకొచ్చింది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బిగ్ బాస్ సీజన్ 4: 30 ఎపిసోడ్ హైలైట్స్.. లాస్య పప్పు వండడం వలన అందరికీ..?