Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బిగ్ బాస్ కంటెస్టెంట్లపై మండిపడిన నాగార్జున... ఎందుకు?

Advertiesment
బిగ్ బాస్ కంటెస్టెంట్లపై మండిపడిన నాగార్జున... ఎందుకు?
, ఆదివారం, 4 అక్టోబరు 2020 (12:55 IST)
బిగ్ బాస్ షో రోజుకు రోజుకు నిరాశపరుస్తుందనే టాక్ వస్తుంది. మరో వైపు ఒక వారం ఒకలా మరో వారం మరోలా ఉంటుంది అనే టాక్ కూడా ఉంది. ఆకట్టుకునే కంటెస్టంట్లు లేకపోవడంతో... వీక్షకులను మెప్పించలేకపోతున్నారు. అయినప్పటికీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. 
 
అయితే.. హౌస్‌లో ఉన్న సభ్యుల ప్రవర్తనలో చాలా తేడా కనిపిస్తుంది. అవినాష్ చేసే అద్ధం కామెడీ సుజాతకు అస్సలు నచ్చడం లేదు. కారణం తెలియదు కానీ.. పాజిటివ్‌గా తీసుకోవడానికి ఇష్టపడడం లేదు. దివి ఎవరితోనూ కలవడం లేదు. గంగవ్వ ఆటలోకి దిగడం లేదు. అమ్మ రాజశేఖర్ కామెడీ చేయడం లేదు.. సీరియస్ అవుతున్నారు. దీంతో ఇంటి సభ్యుల ప్రవర్తనపై నాగ్ ఫైర్ అయ్యారు. 
 
వ్యక్తిగతంగా ఎవరి ఆట వాళ్లు ఆడకుండా పక్కవారికే ఎక్కువ సపోర్ట్ చేసినందుకు నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి ఆట వాళ్లు ఆడకపోతే వాళ్లకే నష్టం అని.. ఆ తర్వాత కథ వేరేలా ఉంటుందని తనదైన స్టైల్‌లో చెప్పారు. అయితే.. ఈ షో రోజురోజుకు ఆసక్తి కలిగించకపోవడంతో వీక్షకులు ఏదైనా ఇంట్రస్ట్ కలిగించేలా వెరైటీ గేమ్ స్టార్ట్ చేస్తారా..? ఇంకా ఎలాంటి ఎంటర్ టైన్మెంట్ ఇవ్వనున్నారు అని ఎదురు చూస్తున్నారు. మరి.. బిగ్ బాస్ ఏం చేస్తాడో చూడాలి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జబర్దస్త్ ముక్కు అవినాష్ గురించి తెలిస్తే?