Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కన్నకూతురు బర్త్ డే బెలూన్లు కడుతూ గుండెపోటుతో ఎన్నారై హఠన్మరణం: పార్ధీవ దేహాన్ని భారతదేశానికి తరలించడానికి నాట్స్ ఏర్పాట్లు

Advertiesment
కన్నకూతురు బర్త్ డే బెలూన్లు కడుతూ గుండెపోటుతో ఎన్నారై హఠన్మరణం: పార్ధీవ దేహాన్ని భారతదేశానికి తరలించడానికి నాట్స్ ఏర్పాట్లు
, శుక్రవారం, 2 అక్టోబరు 2020 (20:53 IST)
ప్లేయిన్స్ బొరో, న్యూ జెర్సీ: 40 ఏళ్ళ వయసున్న అనంతపూర్‌కు చెందిన తెలుగు వ్యక్తి, మసూద్ అలీ, ప్లేయిన్స్ బొరో, న్యూ జెర్సీలో గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. మసూద్‌కు భార్య ఆయేషా, 7 ఏళ్ల కుమార్తె అర్షియా ఉన్నారు. కుటుంబంలో మసూద్ అలీ మాత్రమే సంపాదించే ఏకైక వ్యక్తి. పాపం, ఈ రోజు అతని కుమార్తె అర్షియా పుట్టినరోజు( అక్టోబర్ 1) కూడా.
 
గత సాయంత్రం, అతను తన కూతురు పుట్టినరోజు కోసం బెలూన్లతో అలంకరించడానికి తన అపార్ట్మెంట్ నుండి బయటకు వచ్చారు. అకస్మాత్తుగా గుండెపోటు కారణంగా, అతను తన అపార్ట్మెంట్ ముందే కుప్పకూలిపోయారు. దాంతో సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అక్కడ హాస్పిటల్లో మరణించారు.
 
ఈ దురదృష్టకర సంఘటన జరిగిన వెంటనే, వారు సహాయం కోసం నాట్స్ హెల్ప్‌లైన్‌ను సంప్రదించారు. నాట్స్ న్యూజెర్సీ బృందం మోహన్ కృష్ణ మన్నవ, శ్రీహరి మందాడి, రమేష్ నూతలపాటి, శ్యామ్ నాళం, చంద్రశేఖర్ కొణిదెల, సూర్య గుత్తికొండ హుటాహుటిన వారి కుటుంబాన్ని పరామర్శించి, వారికి సంతాపం తెలియచేసి  నాట్స్ నుండి అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.
 
మసూద్ కుటుంబం, పార్ధీవ దేహాన్ని భారతదేశానికి తరలించాలని నిర్ణయించారు. మసూద్ అలీ పార్ధీవ దేహాన్ని భారతదేశానికి తరలించడానికి ఏర్పాట్లు చేయటంలో నాట్స్ నిమగ్నమైంది. H1 స్టేటస్‌లో ఉన్న మసూద్ అలీ .. తన భార్య, కూతురు కొద్ది నెలల క్రితమే భారతదేశం నుండి వచ్చారు. కరోనా సందర్భంలో బైటకు కూడా ఎక్కడికీ వెళ్లకుండా ఇన్నాళ్లూ ఇంటిపట్టునే ఉన్నారు.
 
దురదృష్టవశాత్తు, మసూద్ అలీకు కానీ అతని భార్య అయేషాకు కానీ ఇక్కడ స్నేహితులు, కుటుంబ బంధువులు కూడా లేరు. ఆయేషా తండ్రి కూడా గతించారు. దీనికితోడు, మసూద్‌కు స్నేహితులు లేరు. పొరుగువారితో కూడా పరిచయం ఎక్కువగా లేదు. ఈ దుర్భర సమయాల్లో మనమందరం ఈ కుటుంబానికి అన్ని విధాలుగా సహాయం చేయాల్సిన సమయం ఆసన్నమైంది.
 
హెల్ప్లైన్‌కి ఈ వార్త తెలిసిన వెంటనే నాట్స్ బోర్డు డైరెక్టర్ మోహన్ మన్నవ ఆధ్వర్యంలో హెల్ప్ లైన్ టీం, న్యూ జెర్సీ చాప్టర్ చూపించిన చొరవను చైర్మన్ శ్రీధర్ అప్పస్సాని, అధ్యక్షుడు శేఖర్ అన్నే అభినందించారు. అమెరికాలో తెలుగు వారికి ఏ కష్టమొచ్చినా ముందుండే ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్), హెల్ప్ లైన్ హెల్ప్ లైన్ 1-888-4-Telugu (1-888-483-5848) పిలుపుకు స్పందించి తమ దాతృత్వాన్ని https://www.natsworld.org/donate-now/ or https://www.gofundme.com/f/Masood-Ali-Family-Support ద్వారా చాటుకుని సాటి తెలుగు కుటుంబానికి సహాయ పడాలని పిలుపునిస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బిపి వున్నవాళ్లు పుట్టగొడుగులు తింటే ఏమవుతుంది? (video)