Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తండ్రికి గుండెపోటు అని చెప్పి ప్రియుడితో ఎంజాయ్ చేసిన వివాహిత

Advertiesment
తండ్రికి గుండెపోటు అని చెప్పి ప్రియుడితో ఎంజాయ్ చేసిన వివాహిత
, బుధవారం, 30 సెప్టెంబరు 2020 (20:51 IST)
పెళ్ళికి ముందే ఆమెకు ప్రియుడు ఉన్నాడు. అతనితో శారీరక సంబంధం కూడా ఉంది. పెద్దలు బలవంతంగా పెళ్ళి చేశారు. పెళ్ళయి మూడేళ్ళవుతోంది. అయితే భర్త దగ్గరకన్నా ప్రియడి దగ్గరే ఆమె ఎక్కువ కాలం ఉండేది. భర్తకు ఏ మాత్రం అనుమానం రాకుండా జాగ్రత్తపడింది. కానీ చివరకు భర్తకే దొరికిపోయింది. 
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఫరీదాబాద్ జిల్లా అసవతి గ్రామానికి చెందిన కలన్ అనే వ్యక్తికి పొరుగున వుండే పట్టణంలోని మహిళకు మూడేళ్ల క్రితం వివాహమైంది. పెళ్ళయిన కొత్తలో బాగానే ఉన్నా సంవత్సరం తరువాత పదేపదే పుట్టింటికి వెళ్ళడం ప్రారంభించింది భార్య.
 
తన కుటుంబ సభ్యులను చూడాలని, అమ్మ గుర్తుస్తోందని, తమ్ముడు గుర్తుకు వస్తున్నాడని.. ఇలా రకరకాల మాటలు చెబుతూ భర్త వద్దన్నా వారించి మరీ వెళుతూ ఉండేది. దీంతో ఇద్దరి మధ్య తగాదా జరిగేది. వెళ్ళేది పుట్టింటికే అని చెప్పినా అక్కడ షాపింగ్‌కు వెళతానని చెప్పి ప్రియుడితో లాడ్జి గదికి వెళ్ళేది.
 
ఇదంతా పెళ్ళయిన తరువాత కూడా సాగుతూ వచ్చింది. మూడురోజుల క్రితం తన తండ్రికి గుండెపోటు వచ్చిందని హడావిడిగా వెళ్ళిపోయింది. మామకు గుండెపోటు కావడంతో కలన్ వాళ్ళ ఇంటికి మరుసటి రోజు ఫోన్ చేసి యోగక్షేమాలు అడిగాడు.
 
అయితే తనకు ఆరోగ్యం బాగానే ఉందని చెప్పాడు మామ. మీ కూతురు ఎక్కడికి వెళ్ళిందని అడిగాడు. షాపింగ్‌కు వెళ్ళివస్తానని చెప్పిందనీ, ఒక్కతే వెళ్ళిందని మామ చెప్పాడు. కలన్‌కు అనుమానం వచ్చింది. తన స్నేహితులు కూడా అదే ఏరియాలో ఉండటంతో వారిని పంపించాడు.
 
ఆమె ఎక్కడ ఉన్నా ఆచూకీ కనిపెట్టి చెప్పండని కోరాడు. దీంతో ఆమె ప్రియుడితో కలిసి షాపింగ్ చేస్తూ కనిపించింది. విషయం కలన్ దృష్టికి వెళ్ళింది. ఇంకేముంది, ఆమె ఎక్కడ వున్నదో అక్కడే వెళ్లి నడి రోడ్డుపై భార్యను చితకబాదాడు. అడ్డుగా వచ్చిన స్థానికులను కూడా పక్కకు తోసేసి భార్యను కొట్టడం ప్రారంభించాడు. అక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు. పోలీసులు వచ్చి విచారిస్తే అసలు విషయం బయటపడింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అలైఫ్‌ బ్రాండ్‌తో హ్యాండ్‌వాష్‌, శానిటైజర్లు విభాగంలో ప్రవేశించిన అదానీ విల్మార్‌