Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అక్రమ సంబంధం కోసం సొంత చెల్లిని ప్రియుడికిచ్చి పెళ్ళి చేసిన అక్క, ఎక్కడ?

Advertiesment
అక్రమ సంబంధం కోసం సొంత చెల్లిని ప్రియుడికిచ్చి పెళ్ళి చేసిన అక్క, ఎక్కడ?
, గురువారం, 24 సెప్టెంబరు 2020 (22:51 IST)
చెల్లి మొగుడిని సోదరుడిగా భావించాలి. కానీ వావివరసలు మరిచిపోయిన ఒక అక్క ఏకంగా అక్రమ సంబంధానికి చెల్లెలి మొగుడినే వాడేసుకుంది. అక్క, చెల్లెలు ఇద్దరు బంపర్ ఆఫర్ అంటూ ఆ యువకుడు రెచ్చిపోయాడు. 
 
నాగర్ కర్నూలుజిల్లా అచ్చంపేటకు చెందిన లింగమయ్య, అనూషకు ఆరేళ్ళ క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. 9 నెలలుగా లింగమయ్య బంధువైన ప్రశాంత్ ఇంటికి వచ్చి వెళుతుండేవాడు. అలా అనూషకు ప్రశాంత్‌తో పరిచయం ఏర్పడింది.
 
ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ప్రశాంత్‌కు పెళ్ళి సంబంధాలు చూస్తూ ఉండడంతో అనూష తన చెల్లెలి మీనా పేరును ప్రపోజ్ చేసింది. అందుకు కారణం ప్రశాంత్‌ను చెల్లెలికి ఇచ్చి పెళ్ళి చేస్తే అతను మనతోనే ఉంటాడని భావించింది.
 
కరోనా సమయంలో రెండు నెలల క్రితం వీరికి వివాహం కూడా చేసేశారు. అయితే అక్రమ సంబంధం మాత్రం రహస్యంగా నడుపుతూ వచ్చింది అనూష. వీరి వ్యవహారం కాస్త లింగమయ్యకు తెలిపిసోయింది. వారం రోజుల నుంచి భార్యాభర్తలిద్దరి మధ్య తరచూ గొడవలే.
 
దీంతో లింగమయ్యను అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేసింది అనూష. ఫుల్లుగా మద్యం తాగి ఇంటికి వచ్చిన లింగమయ్యను ఊపిరాడకుండా చంపేసింది. ఆ తరువాత ప్రియుడు ప్రశాంత్‌తో కలిసి ఫ్యాన్‌కు ఉరివేసి ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులందరినీ నమ్మించింది.
 
భార్యాభర్తలిద్దరూ వారంరోజులుగా గొడవపడుతుండటం బంధువులకు తెలియడంతో వారు పోస్టుమార్టం చేయాలని పోలీసులను కోరారు. పోస్టుమార్టంలో అసలు నిజం బయటపడడం అనూష నిజాన్ని ఒప్పుకోవడంతో నిందితులిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కెసిఆర్ గారూ, ప్రైవేట్ స్కూల్స్‌ను స్వాధీనం చేసుకోండి