పాఠశాలలను నిర్వహించే పరిస్థితిలో లేము. మా స్కూల్స్‌ని స్వాధీనం చేసుకోండి. తెలంగాణలో విద్యను కాపాడండి అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు గుర్తింపు పొందిన ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాల సంఘం లేఖ రాశారు.
ఒకటి నుండి 9వ తరగతి విద్యార్థులను ప్రమోట్ చేయడం, పదవ తరగతి విద్యార్థులను పాస్ చేయడంతో 2019-20 విద్యా సంవత్సరానికి సంబంధించిన సుమారు 50 శాతం వరకు ట్యూషన్ ఫీ బకాయిలు ఉన్నాయి.
ఈ బకాయిలు ఎప్పుడు వసూలవుతాయో తెలియని పరిస్థితి నెలకొని వుంది. ఇప్పటికే ఆర్థిక సమస్యలతో కొన్ని ప్రైవేట్ బడ్జెట్ స్కూల్స్ శాశ్వతంగా మూతపడ్డాయి. అదే బాటలో మరికొన్ని పాఠశాలలు ఉన్నాయి. కొన్ని స్కూల్స్ ఆన్లైన్ తరగతులు ప్రారంభించిన 5 శాతం పేరెంట్స్ కూడా ఫీజు, ట్యూషన్ ఫీజ్ కూడా చెల్లించడం లేదు.
మూడున్నర లక్షల టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి.. కనీసం 50 శాతం జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితిలో ఉన్నాం. టీచింగ్ స్టాఫ్‌ని తగ్గించుకోవాల్సిన పరిస్థితి నెలకొని వుంది.
విద్యార్థులను స్కూల్స్‌తో సంబంధం లేకుండా పదవ తరగతి పరీక్షలకు అనుమతి ఇస్తారని ప్రచారం జరుగుతోంది.
దీంతో పేరెంట్స్ ఎవరు అసలు ఫిజులే కట్టరు. ఇలాంటి పరిస్థితిలో బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలలను ప్రభుత్వానికి సరెండర్ చేయడం తప్ప మరో గత్యంతరం లేదు. స్కూల్స్‌ని స్వాధీనం చేసుకొని టీచర్స్‌కి జీతాలు చెల్లించాలని, అద్దె, వాటర్, కరెంట్ బిల్లు చెల్లించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
ఎలాంటి ఆలస్యం చేయకుండా స్కూల్స్‌ని టేక్ ఓవర్ చేసుకోండి. విద్యా వ్యవస్థని కాపాడండి అంటూ లేఖ రాశారు.