Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కృష్ణానది వరదలు.. శర్వానంద్ తాతయ్య ఇల్లు కొట్టుకుపోయింది..

కృష్ణానది వరదలు.. శర్వానంద్ తాతయ్య ఇల్లు కొట్టుకుపోయింది..
, బుధవారం, 30 సెప్టెంబరు 2020 (15:02 IST)
Sharwanand
కురుస్తున్న భారీ వర్షాలు హీరో శర్వానంద్‌కు చిన్నపాటి బాధను మిగిల్చింది. భారీ వర్షాలకు, శర్వానంద్‌కు లింకేటని ఆలోచిస్తున్నారా?. వివరాల్లోకెళ్తే.. భారతదేశానికి చెందిన అణుశాస్త్రవేత్త డాక్టర్‌ మైనేని హరిప్రసాద్‌, టాలీవుడ్‌ హీరో శర్వానంద్‌కు తాత అవుతారు. ఈయన ఇల్లు అవనిగడ్డ సమీపంలోని ఎడ్లలంక గ్రామంలో కృష్ణానది ఒడ్డున ఉంది. 
 
కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా అనేక ప్రాంతాలు జలమయమైయాయి. ముఖ్యంగా కృష్ణానది పరివాహక ప్రాంతాలు వరదల కారణంగా అతలాకుతలం అవుతున్నాయి. ఈ వరదల్లో డాక్టర్ మైనేని హరిప్రసాద్‌ ఇల్లు కొట్టుకుపోయింది. పాతకాలం నాటి ఇల్లు కావడంతో ఇల్లు మొత్తం నదిలో కలిసిపోయింది. శర్వానంద్‌ అవనిగడ్డ వచ్చినప్పుడల్లా ఆ ఇంట్లోనే ఉండేవారు. వరద నీటిలో శర్వానంద్‌ తాత ఇల్లు కొట్టుకునిపోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది.
 
ఇప్పటికే కుండపోత వర్షాలతో ప్రస్తుతం కృష్ణా నది పొంగి ప్రవహిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ప్రకాశం బ్యారేజీ దగ్గర కృష్ణా నది ఉధృతి మరీ ఎక్కువగా ఉంది. కృష్ణా చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఉండే సామాన్య ప్రజలను ఇప్పటికే ప్రభుత్వం అప్రమత్తం చేసి వాళ్ళను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

అలాగే కృష్ణానది ఒడ్డున ఉన్న మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఇంటికి కూడా వరద ముప్పు ఉండటంతో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు అధికారులు.

ఈ నేపథ్యంలో హీరో శర్వానంద్ తాత డాక్టర్ మైనేని హరిప్రసాద్ ఇల్లు కూడా కృష్ణా నది వరద ప్రవాహంలో కొట్టుకుపోయింది. అవనిగడ్డ సమీపంలోని ఎండ్లలంక గ్రామంలో కృష్ణా నది ఒడ్డున ఈ ఇల్లు ఉంది.
 
హీరో శర్వానంద్ తాత మాజీ అణు శాస్త్రవేత్త అనే విషయం చాలా మందికి తెలియదు. సంఘ సంస్కర్తగా స్థానికంగా ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు. శర్వానంద్ తాత ఇల్లు వరదలో కొట్టుకుపోవడంతో ఈ సంఘటనని చూడటానికి అక్కడకొచ్చిన స్థానికులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఇక గత సంవత్సరం వచ్చిన వరదలకు కూడా శర్వానంద్ ముత్తాత ఇల్లు పూర్తిగా కృష్ణానదిలో కొట్టుకుపోయింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ ముగ్గురు హీరోయిన్లకుట 'డ్రగ్స్ కేసు' నుంచి విముక్తి లభించినట్టేనా?