Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అలైఫ్‌ బ్రాండ్‌తో హ్యాండ్‌వాష్‌, శానిటైజర్లు విభాగంలో ప్రవేశించిన అదానీ విల్మార్‌

Advertiesment
Adani Wilmar forays
, బుధవారం, 30 సెప్టెంబరు 2020 (20:35 IST)
అత్యంత ప్రాచుర్యం పొందిన ఫార్చ్యూన్‌ బ్రాండ్‌ ఎడిబల్‌ ఆయిల్స్‌, ఆహార పదార్థాలను తయారీదారు అదానీ విల్మార్‌ తమ శ్రేణి వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులను విస్తరిస్తూ హ్యాండ్‌వాష్‌ మరియు శానిటైజర్ల విభాగంలో ప్రవేశించింది. వ్యక్తిగత సంరక్షణ విభాగంలో అలైఫ్‌ సబ్బులను ఆవిష్కరిస్తూ 2019లో అదానీ విల్మార్‌ ప్రవేశించింది.
 
‘‘కోవిడ్‌–19 మహమ్మారి కారణంగా హ్యాండ్‌వాష్‌ మరియు శానిటైజర్లకు సంబంధించి అవగాహన గణనీయంగా పెరగడంతో పాటుగా డిమాండ్‌ సైతం పెరిగింది. హ్యాండ్‌వాష్‌ మరియు శానిటైజర్ల విభాగంలో ప్రవేశించేందుకు ఇది అత్యుత్తమ సమయమని మేము భావించాము’’ అని శ్రీ అజయ్‌ మొత్వానీ, హెడ్- మార్కెటింగ్‌, అదానీ విల్మార్‌ అన్నారు.
 
హ్యాండ్‌వాష్‌ ఉత్పత్తుల మార్కెట్‌ 1000 కోట్ల రూపాయలుగా అంచనా. అయితే, సబ్బులు మార్కెట్‌ 95%గా ఉంటే హ్యాండ్‌వాష్‌ మార్కెట్‌ 10%గా ఉంది. ‘‘గత మూడేళ్లలో 15% వృద్ధిని హ్యాండ్‌వాష్‌ విభాగం నమోదు చేసింది. అయితే, లిక్విడ్‌ హ్యాండ్‌వాష్‌ స్వీకరణ పెరిగినట్లుగా మేము చూశాము మరియు రాబోయే ఐదేళ్లలో 30-40% వృద్ధి ఇది నమోదుచేయనుందని అంచనా వేస్తున్నాం’’ అని మొత్వానీ జోడించారు.
 
శానిటైజర్ల దగ్గరకు వచ్చే సరికి 2019లో 150 కోట్ల రూపాయలుగా ఉంటే ఈ సంవత్సరం మూడు రెట్లుకు పైగా పెరిగి 500 కోట్ల రూపాయలను అధిగమించింది. ‘‘కోవిడ్‌-19 మహమ్మారి అంతమైనప్పటికీ శానిటైజర్లకు డిమాండ్‌ మరింత బలీయంగా ఉండే అవకాశాలున్నాయి. రాబోయే ఐదేళ్లలో ఈ విభాగంలో 30-40% పెరిగే అవకాశాలున్నాయి’’ అని అన్నారు. ఈ రెండు విభాగాలలోనూ తమ పోర్ట్‌ఫోలియో విస్తరించడంతో పాటుగా నూతన ఎస్‌కెయులను జోడించనున్నామన్నారు.
 
అలైఫ్‌ లెమన్‌ లెమన్‌ హ్యాండ్‌వాష్‌ను 200 మిల్లీలీటర్ల బాటిల్‌ మరియు 5 లీటర్ల జార్లలో విడుదల చేశారు. నిమ్మ యొక్క సహజమైన రక్షణను గ్లిసరిన్‌ యొక్క చక్కదనం అందిస్తుంది. అలైఫ్‌ హ్యాండ్‌ వాష్‌ బాటిల్‌ను 49 రూపాయల ధరలో అందిస్తున్నారు.
 
అలైఫ్‌ నీమ్‌ ఆలోవెరా శానిటైజర్‌ను 50 మిల్లీ లీటర్‌, 200 మిల్లీ లీటర్‌, 5 లీటర్ల జార్లలో అందిస్తున్నారు. ఇది నీమ్‌ యొక్క సహజమైన రక్షణ, అలెవెరా, గ్లిసరన్‌ యొక్క మాయిశ్చరైజింగ్‌ పోషణలను అందిస్తుంది. అలైఫ్‌ హ్యాండ్‌ శానిటైజర్‌లో 70% ఆల్కహాల్‌ ఉండటంతో పాటుగా 99.9% రక్షణను అందిస్తుంది.
 
‘‘శానిటైజర్‌ మరియు హ్యాండ్‌వాష్‌లను రోజులో కొన్నిసార్లు మాత్రమే వాడాలి. అధికంగా వినియోగిస్తే చర్మం పొడిబారే అవకాశాలు ఉన్నాయి. అలైఫ్‌లో ఉన్న గ్లిసరన్‌ మాయిశ్చరైజర్‌ మార్కెట్‌లోని ఇతర సంస్థల ఉత్పత్తులకు భిన్నంగా ఉంటుంది’’ అని మొత్త్వానీ అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత్‌లో కొత్తగా 80,472 కరోనావైరస్ పాజిటివ్ కేసులు