Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బిగ్ బాస్ నాలుగో సీజన్.. టీఆర్పీ రేటింగ్ విషయంలో అదుర్స్..

Advertiesment
బిగ్ బాస్ నాలుగో సీజన్.. టీఆర్పీ రేటింగ్ విషయంలో అదుర్స్..
, శుక్రవారం, 2 అక్టోబరు 2020 (13:42 IST)
బిగ్ బాస్ నాలుగో సీజన్ రియాల్టీ షోకు వీక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. మొదటి రెండు వారాలు.. వీకెండ్ మినహా, వీక్ డేస్‌లో వీక్‌గా ఉన్న ఈ రియాలిటీ షో.. ఇప్పుడు ఆదివారం, సోమవారం అనే తేడా లేకుండా అన్ని రోజుల్లో నిలకడగా రేటింగ్స్ సాధిస్తోంది. సెప్టెంబర్ 19-25 వచ్చిన రేటింగ్స్ మరోసారి స్పష్టం చేశాయి. 
 
ఆదివారం వచ్చిందంటే.. కింగ్ నాగార్జున వస్తాడు. అదరగొట్టేస్తాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఎప్పట్లానే నాగార్జున రాకతో ఆదివారం ఎపిసోడ్ అదిరింది. ఏకంగా 13.6 (అర్బన్) టీఆర్పీ సాధించింది. శనివారం కూడా ఈ షో కు 9,64 టీఆర్పీ వచ్చింది. ఈ సంగతి పక్కనపెడితే.. సోమవారం నుంచి శుక్రవారం వరకు టెలికాస్ట్ అయ్యే బిగ్ బాస్ కార్యక్రమాలు కూడా ఊపందుకోవడం విశేషం. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్ నిర్వాహకుల్లో మళ్లీ ఊపు వచ్చింది. 
 
ఐపీఎల్ ప్రారంభమైనప్పటికీ.. బిగ్ బాస్‌కు రేటింగ్ తగ్గిపోలేదు. ఐపీఎల్ ప్రారంభానికి ముందు చాలామంది, చాలా అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ ఐపీఎల్ మేనియాతో సంబంధం లేకుండా బిగ్ బాస్ సీజన్-4 దూసుకుపోతోంది. దీంతో బిగ్ బాస్ నిర్వాహకుల్లో ఎక్కడ లేని ఆనందం వెల్లివెరుస్తాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ అవార్డు తీసుకున్న తర్వాతే పెళ్లి చేసుకుంటా: నయనతార